తమిళనాడులో ప్రభుత్వ టీచర్లకు ‘స్టాఫ్ క్వార్టర్స్’

ఇండియా లో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తీసుకుంది.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లందరికి స్టాఫ్ క్వార్టర్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో  35 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి.  వీటిలో  2.25లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వోద్యోగులలో కొందరికి క్వార్టర్లున్నటు టీచర్లకు క్వార్టర్లు లేవు.  కాబట్టి టీచర్లందరికి క్వార్టర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామీణ ప్రాంతాల పాఠశాలలో పనిచేసే టీచర్లు పాఠశాలలకు చేరుకునేందుకు చాలా దూరం ప్రయాణించవలసి వస్తున్నది. దీని వల్ల ఒక్కొక్క సారి అటెండెన్స్ దెబ్బతింటున్నది. అందువల్ల టీచర్లకు పాఠశాలలున్న చోట క్వార్టర్లు నిర్మించాలని ఉపాధ్యాయ సంక్షేమ సంఘాలు ఎప్పటి నుంచో భావిస్తున్నాయి. దీని మీద ఇపుడు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని డిటినెక్స్ట్ రిపోర్టు చేసింది.

పాఠశాలల ఆవరణలో ఖాళీ స్థలం గురించి వివరాలు పంపాలని విద్యాశాఖ  జిల్లా విద్యాధికారులను కోరింది. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని  క్వార్టర్ల నిర్మాణం జరగుతుంది.” మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో క్వార్టర్లు నిర్మిస్తారు. సీనియారిటీని బట్టి క్వార్టర్లను కేటాయిస్తారు. తర్వాతి దశలో పట్టణాలలో , పట్టణ శివార్లలో ఉన్న పాఠశాలల టీచర్లకోసం క్వార్టర్లు నిర్మిస్తారు,’ అని విద్యాశాఖ అధికారి ఒకరు  తెలిపారు. ఈ పథకం వల్ల కనీసం 1.5 లక్షల మంది టీచర్లకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *