నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన బహుజన నాయకుడు మందల మాలకొండయ్య కరోనాతో ఈ రొజు (02-05-21) నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు.
ఆయన బ్యాంక్ మేనేజర్ రిటైర్ అయ్యారు. తర్వాత ధర్మ పోరాట సమితి నాయకుడిగా బీఎస్పీ నాయకుడిగా బహుజన సమాజం కోసం నిరంతరం పోరాటం చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీ నిర్మాణం కోసం ఆయన సతీమణి పద్మమ్మ తో కలిసి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు చిత్తూరు నెల్లూరు లో పని చేస్తున్నారు.
గత సంవత్సర కాలంగా తిరుపతి బౌద్ధారామం కేంద్రంగా బహుజన్ సమాజ్ పార్టీ, బౌద్ధ విధానాన్ని ప్రచారం చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ని తెలుగు రాష్ట్రాలలో పటిష్టం చేయాలని కృషి చేస్తున్న తరుణంలో ఆయన మరణించారు.
’ఆయన మృతి బహుజన్ సమాజ్ పార్టీకి తీరని లోటు, గొప్ప అంబేద్కరిస్ట్ గా కీర్తి గడించారు. మహాత్మ జ్యోతిబాపూలే బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దాదాసాహెబ్ కాన్షీరామ్ ల సిద్ధాంత బలంతో క్షేత్ర స్థాయి నుండి బీఎస్పీ నిర్మాణం కోసం అంకితభావంతో కృషిచేసిన యోధుడు,‘ చిత్తూరు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆయననుకీర్తించింది.
ఆయన భార్య పద్మమ్మకి, కుటుంబ సభ్యులకు చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ తరపున తీవ్ర సానుభూతిని తెలియ చేసింది.