భారతదేశంలో కోవిడ్-19 రెండో తరంగం సునామీలాగా దేశాన్నింత ముంచేయడానికి ప్రధాని నరేంద్రమోదీయో కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవ్జోత్ దహియా (Dr. Navjot Dahiya)పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆయన సూపర్ స్ప్రెడర్ (Superspreader)అని వర్ణించారు. జలంధర్ లో చేసిన ఆయన వ్యాఖ్యాలను ది ట్రిబ్యూన్ (The Tribune) ప్రచురించింది.
బాధ్యతారహింతంగాప్రధాని ఎన్నికల ర్యాలీలను నిర్వహించారని, కుంభ మేలా కు అనుమతినిచ్చారని,దీని వల్ల ఇపుడు దేశమంతా కరోనా సంక్షోభంలో పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో వైద్య రంగమంతా ప్రజలంతా కోవిడ్ నియమాలేమిటో అర్థం చేసుకునేందుకునానా తంటాలుపడుతుంటే కోవిడ నియమాలను గాలికొదిలేసి ప్రధాని మోదీ పెద్ద పెద్ద రాజకీయ ర్యాలీలనుద్దేశించి ప్రసంగించేందుకు ఏమాత్రం వెనకాడలేదని దహియా పేర్కొన్నారు.
“While the medical fraternity is trying hard to make people understand mandatory Covid norms, PM Modi did not hesitate to address the bid political rallies tossing all Covid norms in the air.”
దేశంలో ఎక్కువ మంది చనిపోయేందుకు ఆస్పత్రులలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడమే. కానిమరొకవైపు దేశంలో అనేక ప్రాంతాలలో ఏర్పాటుచేయాలనుకుంటున్న ఆక్సిజన్ ప్లాంటులకు కేంద్రం అనుమతి రాక ఎదురుచూస్తున్నాయి. ఆక్సిజన్ తయారీ కేంద్రాలు ఎంత ముఖ్యమయినవో తెసుకోకుండా మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది , అని ఆయన అన్నారు.
ఇపుడేమయింది, దేశమంతా కరోనా పాండెమిక్ తాండవం చేస్తున్నది. వ్యాక్సిన్ లేదు. ఆసుపత్రుల్లో పడకల్లేవు. ఆక్సిజన్ లేదు. మృతదేహాలు మార్చురీలలో,శ్మశానాలలో పేరుకుపోతున్నాయి,వాటిని తీసుకుపోయేందుకు అంబులెన్సులు కూడా చాలడం లేదు అని ఆయన అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రధాని ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించేందుకు ఆసక్తి చూపారు. కుంభమేలా కు అనుమతించారు.దీనిబట్టి కోవిడ్ నివారణమీద ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుందని డాక్టర్ దహియా అన్నారు.
రెండు తప్పిదాలు చేసి ప్రధాని మోదీ దేశంలో కోవిడ్ వ్యాపించేందుకు కారణమయ్యారని డాక్టర్ దహియా ఆరోపించారు. మొదటి సారి, ఇంకా కోవిడ్ తొలిదశలోనే ఉన్నపుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను స్వాగతం తో చెప్పేందుకు గుజరాత్ లో లక్షమంది ర్యాలీ నిర్వహించారు.రెండోసారి, ఇుడు కరోనా రెండో తరంగంమొదలవుతున్నపుడు, దేశ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయకుండా ఒక ఏడాది కాలాన్ని వృధాచేసినందుకు , మొత్తం ఆరోగ్య వ్యవస్థ కోవిడ్ భారంతో కూలిపోతున్నది.
“In 2020,during the initial days of Corona in the month of January, when first patient of corona was found in India, prime Minister Modi instead of making arrangement to fight Corona, he preferred to organize the gathering of more than one lakh persons in Gujarat to welcome the then US President Donald Trump… Now when the second wave of Covid-19 is yet to reach its peak, the entire health system is falling as PM did not take any step to strengthen it during the entire year.”