తిరుమల శ్రీవారి రాబడి మీద కరోనా దెబ్బపడింది. కరోనా విజృంభిస్తూ ఉండటంతో తిరుమల సందర్శిస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. రోజు రోజుకు తిరుమల యాత్రికుల సంఖ్య పడిపోవడం కనిపిస్తింది. గత అయిదు రోజుల్లోనే తిరుమల యాత్రికుల సంఖ్య సగానికి పడిపోయింది. శ్రీవారి హుండీ ఆదాయం మూడింతలు పడిపోయింది.. శుక్రవారం నాడు శ్రీవారిని 12,679 మంది భక్తులు దర్శించిచారు. 7,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.67 కోట్లు. ఇదే వారారంభంతో శ్రీవారి రాబడి రు. 3.21 కోట్లు.
ఏప్రిల్ 22వ తేదీన 16,412 మంది భక్తులుశ్రీవారి దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారు 7,974 మంది. హుండి ఆదాయం రు. 1.98 కోట్లు.
ఏప్రిల్ 21న 21,265 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11,006 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రు.1.18 కోట్లు.
ఇక ఏప్రిల్ 20 వ తేదీన 23, 636 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారు 11,212 మంది, హుండి ఆదాయం రు. 2.29 కోట్లు.
ఇక ఏప్రిల్ 19 తేదీన 25 వేల 695 మంది తిరుమల సందర్శించి దైవదర్శన చేసుకున్నారు. 12, 253 మంది తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రు 3.21 కోట్లు.