ఒకే ఆసుపత్రిలో 24 గంటల్లో కోవిడ్-19 జబ్బు వల్ల 25 మంది చనిపోయిన పరిస్థితి రాజధాని ఢిల్లీలో ఏర్పడింది. ఆసుపత్రిలో పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉంటూందో చూడండి. రోగుల బంధువులు,మిత్రులు, చూస్తుండగానే, ప్రతిగంటకొకరు చనిపోయి, ఆ శవం ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లుండటం చూసినపుడు ఇతర కోవిడ్ రోగులు ఎంత భయపడి ఉంటారో వూహించవచ్చు. ఈ దారుణపరిస్థితి సర్ గంగారామ్ హాస్సిటల్ ఎదురయింది. అయితే, వీరంతా ఆక్సిజన్ లేక చనిపోయారా లేక కోవిడ్ జబ్బు ముదిరి చనిపోయారా అనే విషయాన్న వెల్లడించకుండా, ఆసుపత్రిలో గత 24 గంటల్లో 25 మంది చనిపోయారని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ ఒక ప్రకటన చేశారు.
“Oxygen will last another 2 hours. Ventilators and Bipap (non-invasive ventilation)not working effectively. Restoring to manual ventilation in ICUs (Intensive Care Units) and EDs. Major Crisis likely. (the) lives of another 60 sick patients in peril. Stop Catastrophe. Need Oxygen to be airlifted urgently. Governments please help. We have warned.”
“ఆసుపత్రిలో ఆక్సిజన్ మరొక రెండు గంటలు మాత్రమే వస్తుంది.వెంటిలేటర్స్, బిపాప్ (non-invasive ventilation)లు సరిగ్గాపని చేయడం లేదు. ఐసియు,ఇడి లలో మాన్యువల్ వెంటిలేటర్స్ ని పనిచేయిస్తున్నాం. భారీ సంక్షోభం ఎదురుకానుంది. మరొక60 మంది రోగుల పరిస్థితి ప్రమాదంలో పడిపోతున్నది. ఈ ఉపద్రవాన్ని అపండి. ఆక్సిజన్ ని వెంటనే విమానం ద్వారా పంపండి. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఇది మాహెచ్చరిక, అని మెడికల్ డైరెక్టర్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో పేర్కొన్నారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.. ఏమవుతుందో చూడాలి.