కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత వ్యాక్సిన్ ప్రోగ్రాంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్లందరికి వ్యాక్సిన్ వేసుకునే అవకాశం లభిస్తున్నది.
గతంలో కేవలం 45 సంవత్సరాలు పైబడిన వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలనే నియమం ఉండింది. ఇపుడు 18 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
వీరికి వ్యాక్సిన్ బుక్ చేసుకునే ప్రాసెస్ మరొక రెండు రోజుల్లో మొదలవుతున్నది.
ఏప్రిల్ 24 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని నేషనల్ హెల్త్ అధారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆర్ ఎస్ శర్మ చెప్పారు.
వీళ్లంతా CoWin తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వ్యాక్సిన్ విధానం, మీరు సబ్ మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఇంతవరకున్నట్లే ఉంటాయి. కాకపోతే, ఈసారి కోవాగ్జిన్, కోవిషీల్డ్‌తో పాటు రష్యన్ వ్యాక్సిన్ స్పూత్నిక్-5 కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ సారి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అవసరమవుతుంది కాబట్టి, ప్రవైటు సంస్థలలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇదే విధంగా వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా తెరుస్తున్నారు. వ్యాక్సిన్ టైమ్ టేబుల్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రయివేటు సంస్థలను ఆదేశించారు. ఈ సమాచారాన్నంతా CoWin ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటుంది.
CoWin లో గాని, APP లోగాని పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు.
- cowin.gov.in వెబ్ సైట్ లో లాగ్ ఇన్ కావాలి మొదట.దీనికి మొబైల్ నెంబర్ అవసరం.
- లాగిన్ అవగానే ఎస్ ఎమ్ ఎస్ ద్వారా ఒక OTP మీఫొన్ కు వస్తుంది.
- ఈ OTP టైప్ చేసి Verify బటన్ మీద క్లిక్ చేయండి.
- OTP ని అది కరెక్టని తేలగానే, వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
- ఈ పేజీలో అడిగిన వివరాలు నింపండి. ఫోటో ఐడి ప్రూఫ్, అధార్ నెంబర్ , మీ ఆరోగ్య సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది. ఇదంతా మీరు టైప్ చేయాల్సిన పనిలేదు. కేవలం Yes లేదా No అని క్లిక్ చేస్తే సరిపోతుంది.
- వివరాలన్ని పొందుపర్చాక కుడివైపున ఉన్న Register అనే బటన్ మీద క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తికాగానే మీకు వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.అందులో మీ అకౌంట్ వివరాలన్నీ ఉంటాయి. అకౌంట్ డిటైల్స్ పేజ్ నుంచే మీరు ఎపుడు వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారో షెడ్యూల్ చేసుకోవచ్చు.
- షెడ్యూల్ అపాయంట్ మెంట్ కు బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు అనుకూలమయిన షెడ్యూల్ ను ఎంచుకోండి. అంతే, మీ వ్యాక్సిన్ షెడ్యూల్ రిజిస్టర్ అయిపోతుంది.
- మీరు ఇక్కడ ఇచ్చే ఫోన్ నెంబర్ తో మరొక ముగ్గురికి కూడా Add More బటన్ నొక్కి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్లకు సంబంధించిన డిటైల్స్ ను కూడా పొందుపర్చి, Add అనే బటన్ నొక్కి తే సరి.
- వ్యాక్సిన్ కోసం అప్పాయంట్ మెంట్ ను ఆరోగ్య సేత యాప్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందులో వ్యాక్సిన్ కోసం ఒక ప్రత్యేక టాబ్ ఏర్పాటుచేశారు. అందులో మీ వివరాలు,వయసు, జబ్బులు, స్త్రీ,పురుష వంటివి జత చేస్తే సరిపోతుంది.
మే నెల ఒకటో తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలవుతుంది. బీహార్, అస్సాం,కేరళ, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.
ఈ రోజు కోవిషీల్డ వ్యాక్సిన్ అందిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ వ్యాక్సిన్ ధరలను నిర్ణయించింది. ప్రయివేటు మార్కెట్లో ఒక డోస్ ధర రు.600 కాగా, ప్రభుత్వ వసతుల్లో రు. 400 ఉంటుంది