(trenidingtelugunews.com team)
భారత ప్రభుత్వం నిన్న ఒక గొప్ప ప్రకటన చేసింది. కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్నందున ప్రజలెవరూ కోవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సిన్ వేయవచ్చని చెప్పింది. పైకి ఇది చాలా ఊరట నిచ్చే ప్రకటనలాగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 45 సం. పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలన్నినియమం ఉండింది.
అయితే, ఇపుడు ఫేజ్ 3 వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీల చిరకాల కోరిక నెరవేరుతుంది. ఇపుడు వ్యాక్సిన్ మొత్తం మార్కెట్ లో అమ్మకానికి వస్తుంది. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, మరొక 50 శాతం ప్రయివేటు సంస్థలకు కేటాయించారు.ఇందులో కేంద్రం వాటా లేదు.
నిజానికి భారత్ వ్యాక్సిన్ పాలసీలో ఏదో లోపం వుంది. కరోనా తగ్గుముఖం పట్టినపుడే ఉత్పత్తి పెంచాల్సి ఉండింది.అలా జరగలేదు. ఇపుడుకేసులు విపరీతంగా పెరుగుతున్నపుడుఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కంపెనీలకు ఆర్థిక సాయం అందించింది.
భారత దేశంలో కోవిషీల్డ్, కో వ్యాక్సిన్ ల ఉత్పత్తి రోజుకు 24 లక్షల డోసులు. డిమాండ్ 37 లక్షల డోసులు. దీనికితోడు భారతదేశం విదేశీ మిత్రులకు కూడా వ్యాక్సిన్ అందించాల్సిఉంది. అయితే, దీనికి తగ్గట్టు ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు జరిగినట్లు లేదు. దీనితో కేసులు పెరిగినాటికి సర్వత్రా వ్యాక్సిన్ కొరత పెరిగింది.అనేక రాష్ట్రాలలో వ్యాక్సిన్ వేయడం నిలిపివేశారు. ఇలాంటపుడు 18 సంవత్సరాలు పైబడిన వాందరికి వ్యాక్సిన్ వేయాలని, మార్కెట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాదు, మే 1 తర్వాత వ్యాక్సిన్ కొరత తాను బాధ్యత కాదని,రాష్ట్రాలదే తప్పని కేంద్రంవాదించే వచ్చు. ఎలాగో చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం తాము తయారు చేసిన వ్యాక్సిన్ లో 50 శాతాన్ని రాష్ట్రంలకు అమ్ముకోవచ్చు. ధరలు మాత్రం మార్కె ట్ ధరలుంటాయి. ధరలు నిర్ణయించే స్వేచ్ఛ కంపెనీలకు ఇచ్చారు. నిన్న ప్రభుత్వం జారీ చేసిన ప్రకనటలో ఏముందో తెలుసా? “Private vaccination providers shall transparently declare their self-set vaccination price”.
వ్యాక్సిన తయారీ దారులు నిర్ణయించే ధర బేస్ రేటుగా ఉంటుంది.దాని మీద వ్యాక్సిన వేసే వైద్య సంస్థలు ధరలను నిర్ణయిస్తాయి. అంటే కేంద్రం వ్యాక్సిన్ ధర నిర్ణయించడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సీన్ తయారుదారుల నుంచి వ్యాక్సిన్ అధికధరలకు నేరుగా కొనాలి అని ప్రకటిచింది.
ఈ అవకాశం కోసేం వ్యాక్సిన్ తయారుచేసే సంస్థలన్నీ ఎదురుచూస్తున్నాయి. ఇపుడు కేంద్రం 18 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని అని చెప్పి కరుణించింది. అంటే ఇక నుంచి వ్యాక్సిన్ సంస్థలకు లాభాలపంటపండుతుందన్న మాట.
మే 1 తర్వాత వ్యాక్సిన్ కొరత ఏర్పడితే, ఇప్పటిలాగా కేంద్రాన్ని నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే, వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు.
దేశంలోని 30 కోట్ల మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చి బాధ్యత తీర్చుకుంది. అంటే మిగతా భారతీయులంతా అధిక ధరలకు వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్ ధరల పరిమితిని కేంద్రం నిర్ణయించలేదు.
నిజానికి ఈ విధానాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. ఎందుకంటే, వ్యాక్సిన్ ధర పెరిగి, రాష్ట్రాలమీద భారీగా ఆర్థిక భారం పడుతుంది.
వ్యాక్సిన్ సరఫరా చేసే బాధ్యతలనుంచి కేంద్రం తప్పించుకుంటున్నది. ఇది వ్యాక్సిన్ తయారీ దారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కానుక.