లాభాలతోనే ‘వైల్డ్ డాగ్’ రిలీజ్


జాతి రత్నాలు సక్సెస్ స్టోరీ తర్వాత తెలుగు బాక్సాఫీసు పరిస్థితి మళ్ళీ మామూలైంది. తాజా విడుదలలు రంగ్ దేవైల్డ్ డాగ్, సుల్తాన్ మంచి ప్రీ-రిలీజ్ ప్రమోషన్లతో  విడుదలయ్యాయికానీ  బుకింగ్స్ దగ్గర బేకారు అన్పించుకున్నాయి.

        మార్చి 26న విడుదలైన నితిన్ – కీర్తీ సురేష్ లు నటించిన రంగ్ దే, ప్రారంభంలో రెండు రోజులు మంచి రిజల్ట్స్ చూపించినా, తర్వాత వసూళ్లు క్షీణిస్తూ వచ్చాయి. పాత రొటీన్ స్టోరీయే కారణం. మౌత్ టాక్ కూడా సరిగా రాలేదు.

రోజుల రన్ లో 16  కోట్ల రూపాయల షేర్ మాత్రమే ఇవ్వగల్గింది. మరో 8 కోట్లు వసూలు చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ రాదు. ఇదిప్పుడు కష్టమేనని చెప్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి కిది డేంజర్ సిగ్నల్. ఇక మళ్ళీ రొటీన్ లవ్వులు తీసేముందు బాగా ఆలోచించుకోవాలి.

        ఇక కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సంగతి. శుక్రవారం విడుదలై 2 రోజుల్లో సుమారు 2 కోట్ల రూపాయల షేర్ రాబట్ట గల్గింది. బాక్సాఫీసు దగ్గర ఇది స్ట్రగుల్ చేస్తోంది. పెరుగుతున్న కోవిడ్ తీవ్రత కూడా కారణమే. వైల్డ్ డాగ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ 9.4 కోట్లు.  బ్రేక్ ఈవన్ కి ఇంకా 7.30 కోట్ల రూపాయలు అవసరం. ఓటీటీ హక్కులు పొందడం తోనే  బాగా లాభాల్లో పడింది. ఇక బాక్సాఫీసులో ఎంత వచ్చినా అది అదనపు లాభమే.

        కార్తీ – రశ్మికా మందన్న నటించిన డబ్బింగ్ సుల్తాన్ 2 రోజుల్లో రూ 1.90 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవన్ కి మరో రూ 4.5  కోట్లు కావాలి. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే ఇది  సందేహంగానే వుంది. ఇలా జాతి రత్నాలు తర్వాత నుంచి ఈ వారం తెలుగు బాక్సాఫీసు లోటుతో నడుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *