తెలంగాణ అమర వీరుల స్తూపం ఇదే, లోన మ్యూజియం, కాన్షరెన్స్ హాల్, రెస్ట్రాంట్

తెలంగాణ అమరుల స్మారకార్ధం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున  అత్యాధునిక  అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం చేపడుతున్నారు.

నిర్మాణ పనుల పురోగతి పై ఆర్ అండ్ బి అధికారులు,వర్క్ ఏజెన్సీ తో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆర్ అండ్ బి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ స్థూపం నిర్మాణం ముఖ్యమంత్రి కెసిఆర్ కల. దీనికి తగ్గట్టుగా ఈ స్థూపం గొప్పగా ఉండాలని తీర్చిదిద్దుతున్నారు.

సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. స్మారక మందిరంలో మూడు అంతస్తు లుంటాయి. 350 కార్లు, 600 బైక్ లు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

డబ్బుకు వెనకాడకుండా ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది.విభిన్నంగా అమరవీరుల స్మారకం నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎవరు హైదరాబాద్ వచ్చినా తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించేలా స్మారకం ఉండాలన్నది సీఎం ఆలోచన అని మంత్రి తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ప్రముఖులు హైదరాబాద్ వస్తే తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించే సంప్రదాయం ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. డిల్లీలో బాపూజీకి నివాళి అర్పించే తరహాలో ఇక్కడ అమర వీరులకు నివాళి అర్పించే సంప్రదాయం రావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

మొదటి అంతస్థు: మ్యూజియం, ఫోటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు ప్రతిబింబించేలా సందర్శకుల కోసం ఫోటో గ్యాలరీ ఉంటుంది.

రెండవ అంతస్థు: జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేలా బెస్ట్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది.

మూడవ అంతస్థు: 3వ ఫ్లోర్లో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *