పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు సభ్యలందరికి చౌకగా ఫైవ్ స్టారో హోటల్ భోజనం అందించనున్నారు. ఇంతవరకు పార్లమెంటులో రైల్వేశాఖ నార్తర్న్ డివిజన్ 1968 నుంచి పార్లమెంటు క్యాంటీన్ నడుపుతూ సభ్యులకు, క్యాంటిన్ సందర్శకులకు చౌకగా భోజనం సరఫరా చేస్తూ వచ్చింది. దాదాపు 52 యేళ్లుగా రైల్లే శాఖయే క్యాంటీన్ నిర్వహిస్తూ వచ్చింది. ఇది చాప్టర్ ముగుసింది. గత నవంబర్ లో నార్తర్న్ రైల్వే ఈ బాధ్యతలనుంచి తప్పుకుని క్యాంటీన్ ని ఐటిడిసికి అప్పగించింది. ఇక నుంచి టూరిజం కార్పొరేషన్ ( ఐటిడిసి) పార్లమెంటు క్యాంటీన్ ని నిర్వహిస్తుంది. ఐటిడిసికి ఢిల్లీలో ఫైవ్ స్టార్ ‘ఆశోక’ గ్రూప్ హోటెళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి పార్లమెంటు సభ్యులకు ఆశోక హోటల్ ఆహారమే చౌకగా లభిస్తుంది. థాలి ధర రు. 100, మినీ థాలి ధర రు. 50 గా నిర్ణయించారు. ఈ మెన్యూ బుధవారం నుంచే మొదలయింది.
ఇక స్నాక్స్ కు సంబంధించి ఉప్మ చట్నీ రు .26 (ఉదయం), పనీర్ పకోడ రు. 50, వెజిటబుల్ పకోరా రు.20, కచోరి రు 15, సమోసా రు.10 (సాయంకాలం), టీ రు. 6లుగా నిర్ణయించారు.