భారతదేశంలో బిట్ కాయిన్ వంటి ప్రయివేటు క్రిప్టోకరెన్సీనలను నిషేధించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దీనికి సంబంధించి బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 (The Regulaition of Official Digital Currency Bill,2021) ను ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్ట బోతున్నారు. ప్రయివేటు క్రిప్టో కరెన్సీ ని నిషేధించి రుపాయి డిజిటల్ వర్షన్ ను విడుదల చేసేందుకు రిజర్వు బ్యాంకుకు ఈ బిల్లు అనుమతినిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలో బిట్ కాయిన్ అనేది చాలా ప్రాచుర్యం పొంది క్రిప్టోకరెన్సీ. 2009 మార్కెట్ క్రాష్ తర్వాత ఇది ఉనికి లోకి వచ్చింది. దీనిని డాలర్లలోకి మార్చుకోవచ్చు. బిట్ కాయిన్ ఈ మధ్య చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. దానిని ప్రాబల్యం పెరిగిపోతున్నది. వజీర్ ఎక్స్, బైకాయిన్, కాయిన్ స్విచ్ కుబేర్ అనేవి మరికొన్ని ప్రయివేటు క్రిప్టో కరెన్సీలు. ఇవంత పాపులర్ కాదు.
2019లో ఏర్పాటు చేసిన ఒక కమిటీ కమిటీ ఇండియాలో క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేయాలని సూచించింది. అంతేకాదు, క్రిప్టో కరెన్సీ తరిమేసేందుకు వాటిని వాడే వారికి పదేళ్ల జైలు శిక్ష విధించాలని కూడా సిఫార్సు చేసింది. ఇలా ప్రయివేటు క్రిప్టో కరెన్సీల బెడద లేకుండా ఉండేందుకు సొంతంగా ఒక అఫిషియల్ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చే విషయం పరిశీలించాలని ఈ కమిటీ సూచించింది. అంతకు ముందు రిజర్వు బ్యాంక్ కూడా వర్చువల్ కరెన్సీ వ్యాపారాలు మానుకోవాలని ఆదేశించింది.
ఈ సూచలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు.