భారత రాజ్యాంగం రాత ప్రతులను గ్యాస్ ఛేంబర్లలో భద్రపరిచారు, ఆ గ్యాస్ ఏంటి?

భారత రాజ్యాంగం ఒరిజినల్ రాత ప్రతులు మూడు ఉన్నాయి. అవి గొప్ప కళాఖండాలు, వీటిని పార్లమెంటు సెంట్రల్ లైబ్రరీలోని మూడు గదుల్లో అద్దాల పెట్టెలో భద్రంగా దాచి ఉంచారు. నిజానికి ఇవి గ్యాస్ ఛేంబర్లు. పార్లమెంటుకు వెళ్లినపుడు మీరు తప్పకుండా చూడాల్సిన విశేషమిది. ఈ గ్యాస్ ఛేంబర్లలో ఉన్న గ్యాస్ ఏమిటి?

రేపు జనవరి 26, మంగళవారం. భారత దేశం 72 వ రిపబ్లిక్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. రిపబ్లిక్ దినోత్సవం అంటే ఒక విధంగా భారత రాజ్యాంగ దినోత్సవం.  1950, జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశం సర్వసత్తాక దేశమయింది. అందుకే అది రిపబ్లిక్ డే అయింది.

ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ భీమ్ రావ్ రామ్జీ అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ తయారుచేసిందని, ఇందులో అంబేడ్కర్ తన అపారం ప్రాపంచిక జ్ఞానం చొప్పించాడని అందరికి తెలుసు.రాజ్యాంగాన్ని చేత్తో రాసిందెవరు?

రాజ్యంగం గురించిన ఇలాంటి ఆసక్తికరమయిన అంశాలు చాలా మందికి తెలియవు. అవి:

భారత రాజ్యాంగం ఒరిజినల్ ప్రతులు మూడు ఉన్నాయి. ఇవన్నీ రాత ప్రతులు. రాజ్యాంగంలోని  సమాచారాన్నంతా ప్రేమ్ బేహారీ నారాయణ్ రైజాదా హస్తలేఖనం నిపుణుడు   చేత్తో అందంగా రాశారు. రాజ్యాంగంలోని ప్రతి పేజీకి భారత ఉపఖండ నాగరికతకు చెందిన అందమయిన బొమ్మలున్నాయి. దేశంలో పేరు మోసిన చిత్రకారులందరితో ఆ చిత్రాలు గీయించారు.

Like this story? Share it with friends!

ఈ మూడు ప్రతులను పార్లమెంటు సెంట్రల్ లైబ్రరీలోని మూడు గదుల్లో అద్దాల పెట్టెలో భద్రంగా దాచి ఉంచారు. ఈ మూడు పెట్టెలు నిజానికి గ్యాస్ ఛేంబర్లు. పార్లమెంటుకు వెళ్లినపుడు మీరు తప్పకుండా చూడాల్సిన విశేషమిది. అపుడుపుడు ఈ పుస్తకాలను ప్రజల సందర్శనార్థం నేషనల్ ఆర్కైవ్స్ లో ప్రదర్శిస్తుంటారు.

రాజ్యంగం రాతప్రతులు చెక్కు చెదరకుండా ఉండేందుకు వాటిని అద్దాల పెట్టెలో భద్రపరిచారు. ఈ ఛేంబర్స్ ని హీలియం గ్యాస్ తో నింపారు. హీలియం జఢవాయువు(Inert Gas). రసాయన చర్యలను అనుమతించదు. అంటే ఈ ఛేంబర్ లోకి బూజు, ఫంగస్ వంటి హానికర శక్తులు రాకుండా అడ్డకుంటుంది. ఫలితంగా రాజ్యంగం రాత ప్రతులు చెక్కు చెదరకుండా ఉంటాయి.

రాజ్యాంగం ఒరిజినల్ ప్రతి సైజు ఎంతో తెలుసా? ఈ అమూల్యమయిన పుస్తకం పొడవు  22 అంగుళాలు.  వెడల్పు 16 అంగుళాలు.  రాజ్యంగా నియమాలన్నింటిని  తొలు పేపర్ మీద రాశారు. ఒకొక్క ప్రతిలో  251 పేజీలున్నాయి.

రాజ్యాంగం రచన పూర్తయ్యేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18రోజులు పట్టింది. దీనిని రాసేందుకు డ్రాఫ్ట్ కమిటీని  ఆగస్టు 29, 1947న ఏర్పాటు చేశారు. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిని క్షుణ్నంగా అధ్యయనం చేసిన అసమాన మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా ని రాశారు.

రాజ్యంగం మీద 1950 జనవరి 24న  284 మంది రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. చిత్రమేమిటంటే, మొదటి సంతకం చేసింది భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ కాదు. భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. తర్వాతే రాష్ట్రపతి సంతకం చేశారు.

సభ్యులలో 46  మంది హిందీలో సంతకం చేశారు. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా  హిందీలోనే సంతకం చేశారు. సభ్యులలో 15 మంది మహిళలు ఉన్నారు.

ప్రపంచంలో ఇంత పెద్ద రాజ్యంగా మరే దేశానికి లేదు.  ఈ కారణంగానే  ఇండియాను అతిపెద్ద రిపబ్లిక్ అంటారు.

ఇది విలువయిన డాక్యుమెంటు కాబట్టి చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఈ పనిని CSIR-National Physical Laboratory చేస్తూ వస్తున్నది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *