అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని హైకోర్టు తీర్పు నిచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఎలాగైనా వాయిదావేసేందుకుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ఫలించలేదు. కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
దీనితో ఎన్నికలు గతంలో విడుదలచేసిన నోటిఫికేషన్ ప్రకారం నాలుగు విడతలుగా జరుగుతాయని ఎన్నికమ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుందని ఆయన చెప్పారు. కలెక్టర్లు, డిజిపి, ప్రధాన కార్యదర్శి తో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతలకోసంచర్యు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇంతరకు తాము ఎన్నికల ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు ఇపుడు ఏమి చెబుతాయో చూడాలి.
నేపథ్యం
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో , అందునా వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేయడంలో రాష్ట్ర యంత్రాంగం నిండా మునిగి ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమని, ఎన్నికమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.
మరొక వైపు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగల సంఘాలు ఎన్నికలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎస్ ఇసి నోటిఫికేషన్ ను ప్రజారోగ్యం రీత్యా సస్పెండ్ చేసింది. అయితే, ఎన్నికలను తాము సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్వహించాలనుకుంటున్నామని, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని, అనేక రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించాయని రమేష్ కుమార్ వాదిస్తూ వచ్చారు. హైకోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు. అందువల్ల హైకోర్టు సింగిల్ జడ్జి రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ ) సవాల్ చేసింది. ఈ అప్పీల్ డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది.
చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.
తీర్పు
వ్యాక్సిన్ పంపకం జరుగుతున్నందున ఎవరికీ ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.
ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ దరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వెల్లడిస్తూ వచ్చింది.
ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేస్తారు