హైదరాబాద్ చికాగోకు పయనమైన ఎయిర్ ఇండియా AI 107
తెల్లవారుజామున హైదరాబాద్కు వచ్చిన AI 108
హైదరాబాద్-అమెరికాల మధ్య వారానికి ఒక నాన్ స్టాప్ విమానసర్వీసు
హైదరాబాద్, 15 జనవరి 2021: ఈ (జనవరి 15) తెల్లవారుజామున 01.00 గంటలకు షికాగో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా – AI-108 నాన్-స్టాప్ విమానం 237 ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బందితో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులకు, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి ఆహ్వానం పలికారు.
అదే విమానం – ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 ఎల్ఆర్- ఫ్లైట్ నెం. AI 107 నేడు సుమారు 12.50 గంటలకు హైదరాబాద్ నుండి షికాగోకు 226 ప్రయాణీకులు, 16 మంది సిబ్బందితో చికాగోకు బయలుదేరి వెళ్లింది.
విమానం ద్వారా చికాగో వెళ్లే ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు పలకడానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఎయిర్ ఇండియా సిబ్బంది టెర్మినల్ వద్ద బారులు తీరారు. చికాగో నుంచి వచ్చిన ప్రయాణికులకు కూడా ఇదే విధమైన స్వాగతం లభించింది. ప్రయాణికుల రాక సందర్భంగా సామాజిక దూరం నిబంధనలతో కేక్ కట్ చేశారు.