తెలుగు వాళ్ల ‘హాస్యనట చక్రవర్తి’ రాజబాబుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అప్పలరాజు.
సినిమా రంగంలో ‘రాజబాబు ‘ గా మారి అలాగే స్థిరపడిపోయారు. తన దైన హాస్యశైలి సినిమారంగానికి అందించారు. ఇంకా సుదీర్ఘ సినిమా యాత్ర చేయవలసి ఉండింది. అయితే, క్యాన్సర్ తో ఆయన 45ఏళ్ళ ప్రాయంలోనే మరణించారు.
రాజబాబు చివరి క్షణాలు సొంత సినిమా విషాద సన్నివేశమొకటి నడిచొచ్చినట్లుంటుంది. ఆసుపత్రిలో ఉదయమే తెల్లచొక్కా వేసుకున్నాడు. అన్నివేళ్లకి ఉంగరాలు ధరించాడు. పక్కనే ఉన్న అమ్మకి, ‘నేను బాగున్నాను. మళ్లీ సినిమాల్లోకి వెళ్తాను. నువు ఇంటికి వెళ్లమ్మా,’ అని పేపర్ మీద రాసి చూపించాడు. ఆమె ధైర్యంగా ఇంటికి వెళ్లింది. అర గంటలోనే రాజబాబు చనిపోయినట్లు సమాచారం వచ్చింది.
కష్టాలు సుఖాలు ఆయన్ని వెంటాడుతూ వచ్చాయి. మద్రాసు టి నగర్ లో ఒక చోట ఎపుడో ఒక రోజున ఐదు రుపాయల సాయం కోసం గంటల తరబడి నిలబడ్డాడు. సినిమాల్లో విజయవంతమయిన తర్వాత, ఖరీదైన కారులో ఆదారిన వెళ్లూ ఆచోటును చూపించి ఆవేదనం చెందేవాడని చెబుతారు.
రాజబాబును నటనలో అనుకరించడం చాలా కష్టం. ఆయన హావభావాలు అనితరం సాధ్యం. మాటతీరు, బాడీ లాంగ్వేజీ గొప్పగా ఉంటాయి. అవెవరికీ కాపీ కాదు. ఆయనకు ఇన్ స్పిరేషన్ రేలంగి అని చెబుతారు. రేలంగి,రమణారెడ్డి, రాజబాబులు తెలుగు హాస్య నటత్రయం. ద్వంద్వార్థాల డైలాగులతో, కించపరిచే విధంగా కాకుండా ఈ ముగ్గరు నటనలో హాస్యం పండించిన వారు. వాళ్ల కాలం తెలుగు చలన చిత్రహస్యానికి స్వర్ణయుగం.
Legendary Comedy Actor #Rajababu Garu pic.twitter.com/FWnyqZ7Tzn
— TeluguCinemaHistory (@CineLoversTFI) June 11, 2020
రాజమండ్రిలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు , రమణమ్మ దంపతులకు రాజబాబు 1937 అక్టోబర్ 20వ తేదీన జన్మించారు. ఇంటర్ మీడియట్ తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తిచేసి, తెలుగు టీచర్ గా ఉద్యోగంలో చేరారు. హైస్కూలు రోజుల్లోనే ఆయన నాటకాల్లో నటించే వారు. బుర్రకథ కూడా చెప్పేవారు.బుర్రకథని నిడదవోలు అచ్యుత రామయ్య దగ్గిర నేర్చుకున్నారు. తెలుగుటీచర్ గా పనిచేస్తున్నా నటుడిగా ఆయన జీవిస్తూ వచ్చారు.
కుక్కపిల్ల దాక్కుంది , నాలుగిళ్ళ చావడి , అల్లూరి సీతారామరాజు నాటకాల్లో రాజబాబు వేసిన పాత్రలు , నటనా ప్రతిభ చూసిన డాక్టర్ గరికపాటి రాజారావు ఆయనను 1960లో మద్రాస్ కు ఆహ్వనించారు.
దర్శకుడు అద్దాల నారాయణరావు తీసిన ‘సమాజం ‘ చిత్రంలో హస్య నటుడి పాత్ర పోషించే అవకాశం దొరికింది. ఈచిత్రంలో హస్య బ్రహ్మ రేలంగి కూడా నటించారు.
తొలిప్రయత్నం విజయవంతంకాలేదు. అయినా సరే రాజబాబు నిరుత్సాహపడలేదు. తర్వాత ఆకాశరామన్న, కులగోత్రాలు చిత్రాలలో నటించాడు. వాటికి కూడా గుర్తింపు రాలేదు.
తర్వాత ‘తోటలో పిల్ల , కోటలో రాణి’ (1964 నవంబర్ 22) చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. దర్శకుడు జివి విశ్వనాథం ఇందులో వాణిశ్రీ సరసన నటించే అవకాశం కల్పించారు. ఈ చిత్రం రాజబాబు జీవితాన్ని కొత్తమలుపు తప్పింది.
సుమారు 20 సంవత్సరాల పాటు చిత్ర రంగంలో ఉన్నారు. 589 చిత్రాల్లో నటించారు. అనేక మంది నటీమణులతో ఆయన నటించినా, రమా ప్రభతో ఆయన కాంబినేషన్ సూపర్ హిట్టయింది. చాలా సినిమాలను ఈ జంటకోసం తీసేవారు. సినిమా కొనేవాళ్లు, రాజబాబు రమా ప్రభ ఇందులో ఉన్నారాఅని అడిగే వారట. ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామరావులకు ఎంత డిమాండ్ ఉండిందో అంతే డిమాండ్ రాజబాబుకు ఉండింది. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఆయన కాల్ షీట్స్ కోసం ఎదరుచేసే వారు. హస్యనటుల్లో ఎవరూ తీసుకోనంత ఎక్కువగారెమ్యూనరేషన్ తీసుకునే వారు. ముందు రాజబాబు బుక్ చేసుకున్న తర్వాతే హీరోలతో నిర్మాతలు డేట్స్ ఖరారుచేసుకునేవారు. ఆరోజులలో హీరోలకి కూడా రాజబాబు భోరసా.
బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ పతాకం ఫై ‘ఎవరికీ వారే యమునా తీరే ‘, మనిషి రోడ్డున పడ్డాడు ‘ వంటి చిత్రాలు నిర్మించి హీరోగా వేసారు. ఈ సినిమాలను ఎందుకు తీశాడో తెలుసా? తనకిష్టమయిన పాత్రలు సృష్టించుకుని నటించేందుకు ఈ చిత్రాలు తీశాడు. ఇవి ఫెయిలయినపుడు‘ఫెయిలయింది నా చిత్రాలు గాని, నా టాలెంట్ కాదు,’ అని ధీమా చెప్పిన వాడు రాజబాబు.
Like this story? Share it with a friend!