హైదరాబాద్ నగరంలో చలిపంజా విసురుతూ ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.పగలు కూడా చలిగా ఉంటున్నది. సాయంత్రం 6 గంట తర్వాత వణికించడం మొదలుపెడుతున్నది.
ఉదయం 8 గంటల వరకు నగరంలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంటున్ని. రాష్ట్రంలోకి ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో వాతావరణం ఇలా పొడిగా మారింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ టెంపరేచర్ కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మరో రెండురోజులు వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారు శీతలగాలులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
అంతేకాదు, విజిబిలిటి.. రోడ్ల మీద ఏమీ కనిపించని పరిస్థితి ఉంటున్నందున పొద్దున పూట ప్రయాణాలు సాధ్యమయినంతవరకు మానుకోవాలని పోలీసులు కూడా హచ్చరిస్తున్నారు. వాహనాదారులు ఎదురుగా వచ్చే వారికి తమ వాహనాలు కనిపించేలా హైబీమ్ లైట్ వేయరాదని కూడా వాడుహెచ్చరిస్తున్నారు.