హైదరాబాద్ సోమాజిగూడ లో నిన్న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమాజిగూడ నుండి రాజ్ భవన్ వెళ్ళే ప్రధాన రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకు వచ్చిన ఒక్క జీప్ రోడ్ పక్కనే ఉన్న దర్గాను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దర్గాను ఢీకొట్టగానే జీప్ బోల్తా పడింది.
గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డు పై నుండి జీప్ ను తొలగించారు.