అనంత కలెక్టర్ గంధం చంద్రుడు రూటే సపరేట్

(చందమూరి నరసింహారెడ్డి)
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్టైలే వేరు ఆయన పనితీరు వినూత్నం ప్రతిదీ ప్రయోగాత్మకంగా వినూత్న తరహాలో పలువురికి ఆదర్శంగా పని చేసుకుంటూ పోతున్నాడు.
జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో పాదరక్షలు వదిలేసి వెళ్లడం, చేతులు కట్టుకుని నిలబడటం వంటి దురాచారాన్ని రూపుమాపేందుకు ‘ఆత్మ గౌరవం’ పోస్టర్‌ను విడుదల చేసి ప్రజల్లో అవగాహన చైతన్యయం కల్పించే దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఈ నినాదంతో బ్యానర్లు ఏర్పాటు చేశారు.
బాలికల దినోత్సవం రోజున జిల్లాలోని అన్ని ప్రభుత్వ అ కార్యాలయాలలో ఒకరోజు అధికారులుగా జిల్లాలోని బాలికలకు అవకాశం కల్పించి వారిలో ఒక ప్రేరణ ఉత్సాహం కల్పించారు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరిని నీ ఆకట్టుకొంది స్వయంగా కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని అభినందించడం సంతోషకరమైన పరిణామం .
హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ లాంటి పేర్లను మార్చాలని కేంద్రం జీఓ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను, దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అమలు చేశారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.

దేశంలో తొలిసారి అనంతపురం జిల్లా లో కుల కాలనీల పేర్లు మార్పు సామాజిక దురాచారంపై కలెక్టర్ గంధం చంద్రుడు పోరు ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లాలో 480 కాలనీల పేర్లు మార్పు కు శ్రీకారం చుట్టారు. 2019లోనే జిల్లా లో జీవో జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పూర్తితో గతనెలలో మహారాష్ట్ర ప్రభుత్వం జీఓనుఅమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
వందల ఏళ్లుగా కుల వివక్ష మన దేశంలో వేళ్లూనుకుని మహమ్మారిలా విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో కులాల పేరుతో వీధులు ఉంటాయి, హరిజనవాడ అని ఇతరత్రా పేర్లతో ఎస్సీ, ఎస్టీలను అంటరానివారుగా గ్రామ శివార్లకే పరిమితమయిపోతున్నారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగినా, కాలం మారిపోతున్నా కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు, కొన్ని పట్టణాల్లోనూ ఈ వివక్ష కొనసాగుతూనే ఉండటం శోచనీయం.

https://trendingtelugunews.com/entertainment/banaganipalle-touring-talkies-tents-movies-exhibition-andhra-pradesh/

ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ లాంటి పేర్లను మార్చాలని జీఓ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను, దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అమలు చేశారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ఆర్థిక అభివృద్ధితోపాటు, సామాజిక వృద్ధి కూడా కీలకంగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలతో 2019లోనే జిల్లా వ్యాప్తంగా హరిజన, గిరజన, దళితవాడలుగా పిలవబడుతున్న 480 కాలనీల పేర్లను మార్చడంలో కీలకపాత్ర పోషించారు. కులాల పేర్లతో ఉన్న బడుల పేర్లను సైతం మార్చి అన్ని కులాలకు చెందిన పిల్లలు కలిసి చదువుకునేలా చర్యలు చేపట్టారు.
ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, చాకలి వీధి, ఇలా అనేక రకాలుగా ఉన్న ఆయా కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలనీ, జగ్జీవన్ రామ్ నగర్, విశ్వరత్న నగర్, విన్సెంట్ కాలనీ ఇలా పేర్లు పెట్టారు. అలాగే జిల్లా ప్రజలకు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛంద సేవలందిస్తోన్న ఆర్డీటీ ఫౌండేషన్ స్థాపకుడు డేవిడ్ ఫెర్రర్ పేరును కాలనీలకు పెట్టి అక్కడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. మరికొన్ని ప్రాంతాల పేర్లు మార్చేందుకు చర్యలు చేపట్టారు.
కుల వివక్షతను సైతం రూపుమాపేందుకు కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అనంతపురం జిల్లా బాటలో కులాల పేర్లతో ఉన్న వాడల పేర్లను మార్చేలా నిర్ణయం తీసుకోవడం ముదావహం.

అదేవిధంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని అనేక హరిజన గిరిజన నివాస ప్రాంతాలలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆరోజు రాత్రి పల్లెవాసులతో గడిపి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయడం కలెక్టర్ పనితీరును తెలియజేస్తున్నది. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు ఈ సందర్భంగా కలెక్టర్ కి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటివారిని విద్యార్థులు మేధావులు పాలకులు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహా రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కాసా సుబ్బారావు అవార్డు గ్రహీత, అనంతపురం జిల్లా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *