ఈ రోజు ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్ మెంట్, ఎపి ని ఏర్పాటుచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్ మెంట్ ఆనంద్ తరహాలో దీనిని ఏర్పాటుచేస్తారు. ఆనంద్ ఇన్ స్టిట్యూట్ అటానమస్ సంస్థ.
దేశంలో ఈ తరహా ఇన్ స్టిట్యూట్ లలొో ఇదే మొదటిది. ఆంధ్రప్రదే ప్రభుత్వం కూడా ఇదే తీరులో ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుచేయాలని పులివెందులను ఎంపిక చేశారు.
ఏపి కార్ల్‌లో ఇర్మా–ఏపీ రూ.83.59 కోట్లతో ఏర్పాటు చేస్తారు.ఈనెల 24న ముఖ్యమంత్రి జగన్ దీనికి శంకుస్థాపన చేస్తారు.
ఎపి క్యాబినెట్ తీసుకున్న మరిన్ని కీలకమయిన నిర్ణయాలు
*ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన మూడో విడత రైతు భరోసా అమలుకు కేబినెట్ ఆమోదం. *ఒక్కో రైతు, కౌలురైతులకు రూ.2వేలు ఇవ్వనున్న ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకే పంపించనున్న ప్రభుత్వం. డిసెంబర్ 29న రైతుల ఖాతాల్లోకి పంపించనున్న ప్రభుత్వం. ఇదివరకు రెండు విడతుల్లో రూ.11,500 చొప్పున ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం *రైతు భరోసా కింద 50.47 లక్షల మందికి ప్రయోజనం రూ.1009 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి
*నివర్ తుపాను బాధిత రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. డిసెంబర్ 29నే ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇవ్వనున్న ప్రభుత్వం
* పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖలో కాంట్రాక్ట్ విధానంలో 147 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, అదే సంఖ్యలో ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. నియోజకవర్గాల స్థాయిలో పశువ్యాధి నిర్ధారణకు పరీక్షా కేంద్రాల్లో వీరిని నియమించనున్న ప్రభుత్వం
*ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్‌సీ) ఏర్పాటుపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలు చేపట్టనున్న కార్పొరేషన్.
డిసెంబర్ 21 నుంచి సమగ్ర భూ సర్వేకు కేబినెట్ ఆమోదం ఈమేరకు 1923 నాటి ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు బౌండరీల చట్టంలో కొన్ని సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
*సర్వే ట్రైనింగ్ కాలేజీకోసం చిత్తూరుజిల్లా తిరుపతి అర్బన్ మండలంలోని చెన్నయ్యగుంట గ్రామంలో 41.19 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం ప్రభుత్వ ఆధీనంలో కాలేజీ ఏర్పాటు
* పప్పుదినుసులు, తృణధాన్యాల పరిశోధన కోసం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చినపావని గ్రామంలో 410.30 ఎకరాల భూమిని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం