భారతీయ జనతా పార్టీ రాజకీయాలు హైదరాబాద్ పాత బస్తీ నుంచి మొదలవుతున్నాయి. ఈ పార్టీ పాతబస్తీ చార్ మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని కేంద్రం చేసుకుని రాజకీయ తుఫాన్ సృష్టించాలనుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ ని హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన అమెజాన్ వంటి సంస్థలను చూపించి రాజకీయాలను నడపాలనుకుంటుంటే, భారతీయ జనతా పార్టీ పాత బస్తీ నుంచి హైదరాబాద్ విముక్తి అంటూ రాజకీయాలు నడపాలనుకుంటూ ఉంది.