తమిళనాడు అక్షరాల జాక్ పాట్ కొట్టేసింది. ఓలా కంపెనీ ఎలెక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే యూనిట్ ను తమిళనాడు ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్లాంట్ మీద ఓలా 2400 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల తమిళనాడుకు 10 వేల ఉద్యోగాలు లభిస్తాయి.
ఈఫ్యాక్టరీ పెట్టేందుకు తమిళనాడుతో ఓలా ఒప్పందం చేసుకుంది. ఒక ఏడాదిలో ఫ్లాంట్ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
ఇది ప్రపంచంలోనే అత్యాధునికమయిన ఫ్యాక్టరీ అని ఓలా ఛెయిర్మన్ , గ్రూప్ సిఇవొ భవిష్ అగర్వాల్ చెప్పారు. ఇక్కడ తయారయ్యే స్కూటర్లను ప్రపంచమంతా ఎగుమతి చేస్తారు.
ఓలా అందించిన సమాచారం ప్రకారం ఇక్కడి స్కూటర్లను ఆసియా, ఐరాపాతో పాటు లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ప్లాంటు ఏర్పాటుకు ఓలా ఎలెక్ట్రిక్ (Ola Electric) టైగర్ గ్లోబల్, మాట్రిక్స్ ఇండియా, టాటా సన్స్ తదితర కంపెనీలనుంచి 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి సేకరించింది.