సికిందరాబాద్ క్లాక్ టవర్ ఈ సాయంకాలం గంటలు మోగించింది. వందలాది మంది వీక్షకులు మొబైల్ లో వీడియోలు, ఫోటోలు తీసుకుంటుండగా ఖంగన వందేళ్ల నాటి ఈ గడియారం ముల్లులు మళ్లీ తిరగడం మొదలు పెట్టాయి. ఈ పార్క పునరుద్ధరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ గడియాారాన్ని రిపేరు చేయింది. గతంలో ఒక సారి రిపేరయినా మళ్లీ పాడయింది. హైదరాబాద్ కు చెందిన రమేష్ వాచ్ కంపెనీ ఈ సారి గడియారాన్ని మరమ్మతు చేసింది.
ఈ గడియారపు గోపురాన్ని 1860 సుమారు 10 ఎకరాలలో ఒక అందమయిన స్మారకోద్యానవనంగా ఏర్పాటు చేశారు.అయితే, దీనిని 1897లో అప్పటి హైదరాబాద్ రెసిడెంట్ సర్ ట్రెవర్ జాన్ సిచీల్ ప్రారంభించారు. కాలక్రమేణా ఇది నిర్లక్ష్యానికి గురయింది. పార్క్ రెండున్నరఎకరాలకు కుంచించుకుపోయింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో 2003లో ఈ పార్క్ ను, ఈ క్లాక్ టవర్ ను కూల్చేయాలనుకున్నారు. అయితే,తర్వాత ఈ ఆలోచన విరమించుకునయ్నారు. 2006 పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. ఈ లోపు ఈ క్లాక్ టవర్ కు యునిసెఫ్ హెరిటేజ్ నిర్మాణం గుర్తింపువచ్చింది. ఇపుడు మునిసిపాలనా మంత్రి కెటి రామారావు, శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ల చొరవతో గడియారాన్ని పునరుద్ధిరించే పనులు మొదలయి, ఈ రోజు పూర్తయ్యాయి.
After #MJMarket, the Clock with chimes restored at clock tower #Secunderabad
Well done @ZC_Secunderabad
We will be restoring the remaining such clock towers also @KTRTRS pic.twitter.com/7Fn3JhHhez
— Arvind Kumar (@arvindkumar_ias) December 11, 2020