ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కి రూ. 100 కోట్ల జరిమానా విధించినట్లు తెలిసింది.
ఈ జరిమానా రూ.100 కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేస్తామని వారు కార్పొరేషన్ అధికారులు నోటీసు పంపినట్లు సమాచారం.
తాడిపత్రి సమీపంలో త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ అక్రమాలకు పాల్పడినట్లు మైనింగ్ కార్పొరేషన్ గుర్తించింది. దీనికోసం యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి 14 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాలను దోపిడీ చేసినట్లు అధికారులు గురించారని తెలిసింది.