తెలంగాణ కాంగ్రెస్ పార్టీ GHMC ఎన్నికల మేనిఫెస్టో విడుదల
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ. 50వేలు, పూర్తిగా దెబ్బతిన్న గృహలకు రూ. 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ. 2.5లక్షల చొప్పున సహాయం చేస్తామని వెల్లడించారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన చేసిన కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ .. కాంగ్రెస్ మేనిఫెస్టోను వెల్లడించారు.
విశేషాలు:
*ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ. 50వేలు. పూర్తిగా దెబ్బతిన్న గృహలకు రూ. 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ. 2.5లక్షల చొప్పున సహాయం
*అందరికీ అందుబాటులో వైద్య సేవలు. ఆరోగ్యశ్రీ పధకంలో కోవిడ్ 19 చికిత్స
*30, 000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా
* ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్, ధరణి రద్దు
* మహిళలకు, విద్యార్ధులకు, దివ్యాంగులకు, వృద్దులకు గ్రేటర్ లో ఉచిత రవాణా సదుపాయం
* విధ్యా రంగంపై ప్రత్యేక దృష్టి
*మహిళలకు, విద్యార్ధులకు, దివ్యాన్గులకు, వృద్దులకు ఆర్టీసి బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ లలో నగరంలో ఉచిత రవాణా సదుపాయం
* అర్హత గల వారికి ఉచిత గృహాలు. ఇంటి జాగా వున్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది లక్షల రూపాయిలు సాయం
*100యూనిట్లులోపు విద్యుత్ధ్యు ఉపయోగించుకునే గృహ వినియోగదారులకు విద్యుత్ రాయితీ
*కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ
*జిహెచ్ఎంసి పరిధిలో చెరువులు రక్షణ అథారిటీ ఏర్పాటు చేసి కబ్జాదారుల చెర నుండి చెరువుల పరిరక్షణ
*అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంపు
* సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లకు పన్ను మినహాయింపు
*మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ