దళిత నాయకుడు,కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

ప్రముఖ దళిత నాయకుడు, బీహార్ కు చెందిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్  (74) కొద్ది సేపటి కిందట మరణించారు. కొద్ది రోజుల కిందట ఆయన  ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గుండెచికిత్స జరిగింది. గురువారం నాడు ఆయన మరణించారు. ఈ విషయాన్ని కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు.

 

 

పాశ్వాన్ దేశంలో జాతీయ స్థాయి గుర్తింపు దళిత నాయకుడు. సోషలిస్టు నేపథ్యంలో నుంచి వచ్చి 50  సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.  వాజ్ పేయి నాయకత్వంలో మొదటి సారి ఎన్ డిఎ ప్రభుత్వం ఏర్పడి నప్పటినుంచి ఆయన కేందమంత్రిగా  కొనసాగుతున్నారు. మరణించే నాటికి ఆయన ప్రధాని మోదీ క్యాబినెట్ లో  ఆహారం ,పౌరపరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన జూలై5, 1946 న బీహర్ లోని ఖగారియా జిల్లాలో జన్మించారు. పాశ్వాన్ పోలీసాఫీసర్ కావాలని కలగన్నాడు. అలాగే పరీక్ష పాసయ్యారు. డిఎస్ పి సెలెక్టయ్యారు. అయితే, సోషలిస్టు రాజకీయ ప్రభావం ఆయన్ని బీహార్ అసెంబ్లీకి తీసుకువచ్చింది. పార్లమెంటులోని సీనియర్ సభ్యుల్లో ఆయన ఒకరు. 1984-89,2009-2014లలో తప్ప 1977 నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడి గా కొనసాగుతూనే వస్తున్నారు.
మోదీ క్యాబినెట్ నుంచి చనిపోయిన రెండో మంత్రి పాశ్వాన్. గత నెలలో కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి అంగడి సురేష్ కరోనా తో చనిపోయిన సంగతి తెలిసిందే.
అదేదయినా కానీయండి కేంద్రంలో ఏర్పడిన ప్రతిసంకీర్ణ ప్రభుత్వంలో రామ్ విలాస్ పాశ్వాన్ మంత్రిగా ఉన్నారు.

ఇదెలా సాధ్యమయింది?
రామ్ విలాస్ పాశ్వాన్ ను లాలూప్రసాద్ యాదవ్  ‘వాతావరణ శాస్త్రవేత్త’ (Mausam Vaigyanik) అని పిలిచేవాడు.  కారణం, రాజకీయ వాతావరణ ఎటువీస్తున్నదో పాశ్వాన్ పసిగట్టే వాడు. వాతావరణానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే వాడు. 2009 ఎన్నికలపుడు  బీహార్ లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు కేటాయించాలని పాశ్వాన్  అపుడు రైల్వే మంత్రిగా ఉన్నలాలూను పాశ్వాన్ కోరారు. వారిద్దరు ఆ రోజుల్లో మన్మోహన్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు.  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడుతుందని లాలు వాదించాడు.పాశ్వాన్ దీనిని వ్యతిరేకించాడు. పాశ్వాన్ మాట లాలూ వినలేదు. ఆ ఎన్నికల్లో బీహార్ లో లాలూ మట్టికరిచాడు. పాశ్వాన్ కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు వచ్చాయి. రెండో సారి యుపిఎ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో.  అప్పటి నుంచి లాలూ ప్రసాద్ పాశ్వాన్  రాజకీయ వాతావరణ శాస్త్రవేత్త అని పిలిచేవాడు. తన కాలం అయిపోతున్నదని ఆయన భావించారేమో 2019లో ఆయన రెండు నిర్ణయాలు తీసుకున్నారు. లోక్సభ సీటు తమ్ముడికి, పార్టీ అధ్యక్ష పదవి కుమారుడు చిరాగ్ కు ఇచ్చితాను రాజ్యసభలో ప్రవేశించారు.

రామ్ విలాస్ పాశ్వాన్  సంయుక్త సోషలిస్టు పార్టీ (SSP) లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 1969లో తొలిసారి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటయిన లోక్ దళ్ పార్టీ సభ్యుడయ్యారు. చాలా కాలం కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో ఉన్నారు. లోక్ నాయక్ జయ్ ప్రకాశ్ నారాయణ్ అనుచరుల్లో పాశ్వాన్ ఒకరు. ఆయన నాయకత్వంలోనే పాశ్వాన్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇందిరా గాంధీ పాలనని వ్యతిరేకించారు.
1975లో ఇందిరాంధీ ఎమర్జన్సీ విధించినపుడుఅరెస్టయి జైలు కెళ్లారు.1977లో విడుదలయ్యారు. ఆ యేడాదే జనతా పార్టీ సభ్యుడిగా హాజీ పూర్ నియోజకవర్గం నుంచి  తొలిసారి లోక్ సభకు అత్యధిక మెజారీటీతో ఎన్నికయ్యారు. గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. (ఆ రికార్డును 1991లో నంద్యాల నుంచి పోటీ చేసి పివి నరసింహారావు బ్రేక్ చేశారు.)  అప్పటి నుంచి ఆయన  వరసగా అయిదు సార్లు హాజీపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. మొత్తంగా హాజీ పూర్ నుంచి ఏడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.
2000 లో ఆయన లోక్ జన శక్తి పార్టీ ఏర్పాటుచేశారు. వాజ్ పేయి నాయకత్వంలోని  మొదటి ఎన్ డిఎలో మంత్రి అయ్యారు. వాజ్ పేయి ప్రభుత్వం పోయాక ఆయన కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ (2004)లో  ప్రభుత్వంలో చేరి మంత్రి అయ్యారు. 2014 దాకా ఇదే పదవిలో కొనసాగారు. 2014లో నరేంద్రమోదీ  నుంచి పిలుపు రాగానే ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకుని ఎన్డీయే చేరారు.
గత ఏడాడి లోక్ సభ ఎన్నికలకు పోటీ చేయకుండా తన సోదరుడు  పశుపతికుమార్ ని పోటీ చేయించి తాను రాజ్యసభకువచ్చారు.
ఎస్ సి లలో ఆయన దుసాద్ కులానికి  చెందిన నాయకుడు. జాతీయ స్థాయికి ఎదిగినా ఆయన పార్టీ హోదా మాత్రం బీహార్ దాటి రాలేదు.మరొక బిఎస్ పి కాలేకపోయింది. బీహార్ లో నితిన్ కు ప్రత్యాామ్నాయం కాలేకపోయింది. ఆయనకుమారుడు రాజకీయాల్లోకి ప్రవేశించిన సంవత్సరమే ఆయన మృతిచెందడంతో దుసాద్ వోట్ పాశ్వాన్ కు నివాళిగా కుమారుడు చిరాగ్  పడవచ్చు. అలా కుమారునికి సానుభూతి అనకూలించవచ్చు.