రెవిన్యూ శాఖ అవినీతికి భర్త బలి, చచ్చేందుకు మాకూ అనుమతినీయండి: కుటుంబం

“రెవెన్యూశాఖ వల్ల నా భర్త బలి అయిపోయాడు, నా కుటుంబానికి న్యాయం చేస్తారా? లేదా మేము కూడా చనిపోవడానికి పెర్మిషన్ ఇప్పిస్తారా?” అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కి ఒక చేనేత కూలి భార్య  కోసూరి కృష్ణవేణి లేఖ రాశారు. ఆమె ఫోన్ నెంబర్ 8919931255.
ఆమె కలెక్టర్ కు రాసిన లేఖ
అసలు విషయమేంటంటే…
అక్టోబర్ మూడో తేదీన ‘ఆంధ్రలో దారుణం, భూమి లాక్కున్న ఎమ్మార్వో, రైతు ఆత్మహత్య’ శీర్షికన  ట్రెండింగ్ తెలుగు న్యూస్ మొట్టమొదట కృష్ణ వేణికి జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టింది.
తుని నియోజకవర్గ, తొండంగి మండలం, కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన లేటు కోసూరి నాగేశ్వరరావు గారి భార్య కోసూరి కృష్ణవేణి.
ఆమె చెబుతున్న వివరాలు ఆమె మాటల్లోనే:
మేము చేనేతకులనికి చెందిన వాళ్ళం. ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల ఇవ్వడం కోసం గ్రామంలో 14 ఎకరాల 15 సెంట్ల గ్రామ కంఠం భూమి ఉండగా , దాదాపుగా 80 సం.రాలుగా మాకు చెందిన 20 సెంట్ల భూమిని అన్యాయం గా తీసుకోవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు సిద్ధపడ్డారు.  ఆభూమి ఆమెకు తండ్రి నుంచి సంక్రమించింది.
లేదంటే 2 లక్షల లంచం ఇవ్వమని డిమాండ్ చేశారు.
నా భర్త ఆ మొత్తం డబ్బును ఇవ్వలేను అనే సరికి రెవెన్యూ సిబ్బంది, RI , MRO, సర్వేయర్, VRO కలిసి JCB తో మా భూమిని అక్రమించేందుకు వచ్చారు.
నా భర్త మనస్తాపంతో నా భూమినే ఎందుకు తీసుకుంటున్నారు పురుగుల మందు తాగి చనిపోతాను అని వారి ముందే సెల్ఫీవీడియో ( ఆ వీడియో కింద పెడుతున్నాను)తీసుకున్నా, సరే ఛస్తే చావు అని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో నా భర్త వారి ముందే పురుగుల మందు తాగాడు .
రెవెన్యూ సిబ్బంది వారి వాహనం లొనే నా భర్తను హాస్పిటల్ కి తీసుకెళ్లారు తర్వాత చనిపోయాడని అని మాకు చెప్పారు.
రెవెన్యూ సిబ్బంది, విఆర్ వో, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ వల్లనే న భర్త చనిపోయాడు… నాకు న్యాయం చేయాలని హైకోర్టు ని ఆశ్రయించాను. సీఎం గారి, DGP, చీఫ్ సెక్రటరీ గారికి, తూ.గో కలెక్టర్ గారికి, SP గారికి, పెద్దాపురం RDO గారికి, పెద్దాపురం DSP గారికి నాకు నాయ్యం చేయాలని కోరాను.
హైకోర్టు స్పందిస్తూ మాకు లెటర్ కూడా పంపారు.
రెండు రోజుల తర్వాత MRO గారు గ్రామానికి చెందిన VRO, గుమస్తా, బారిక ఈ ముగ్గురును మా వద్దకు పంపించి సంతకాలు పెట్టకపోతే మీ కుటుంబం రిస్క్లో పడుతుంది అని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు.తర్వాత మాకు ఈ సంతకాలు కేస్ Withdraw  చేసుకుందుకు పెట్టించుకున్నారు అని తెలిసి వెంటనే పోలీవారిని ఆశ్రయించాను పోలీస్ వారు కూడా అదేం పర్వాలేదు అని ఈ విషయంపై యాక్షన్ తీసుకోనన్నారు.
దీన్నిబట్టి చూస్తే నాకు, నా కుటుంబానికి ఎక్కడ న్యాయం జరుగదు అనుకున్నాము. తర్వాత తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారిని ఆశ్రయించాము, వారు మాకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారితో పాటు రాష్ట్రంలో బీసీ సోదరి సోదరులందరుకు నా న్యాయం పోరాటానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము.

 

ఇపుడు తన కుటుంబానికి న్యాయమైనా చేయండి లేదా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించండి అనే ఆమె కలెక్టర్ ను కోరుతున్నారు.