బాబ్రీ మసీదు కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరిస్తూ కేసును కొట్టి వేసింది.
1992 డిసెంబర్ 6న జరిగిన మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని చెబుతూ ఎల్ కె అడ్వానీ తో 32 మంది నిందితులను నిర్దోషులను సిబిఐ కోర్టు జడ్జి సురేంద్రకుమార్ యాదవ్ తీర్పు చెప్పారు.
సంఘటన జరిగిన 28 సంవత్సరాల తర్వాత ఈ కేసు తీర్పు వెలువడింది.
అడ్వానీతో మాజీ కేంద్రమంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ముద్దాయిలుగా ఉన్నారు.
తీరు వెలువడుతున్న సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వానీ తదితరులు వీక్షించారు.
మసీదు కూల్చివేత ‘కుట్ర’ అనేది ఈ కేసు. దీనికి సంబంధి సిబిఐ 351 మంది సాక్షలును విచారించింది. 699 డాక్యమెంట్లను సమర్పించింది. కేసులో మొత్తం 49 మంది నిందితులు.వీరిలో 17 మంది చనిపోయారు. న్యాయమూర్తి 2000 పేజీల తీర్పు వెలువరించారు.
సిబిఐ సమర్పించిన సాక్ష్యాలలో పసలేదని భావించి కోర్టు కేసును కొట్టి వేసిందని డిఫెన్స్ లాయర్ మనీష్ త్రిపాఠీ చెప్పారు. కూల్చివేత ల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూపరిషత్ లకు ఎలాంటి పాత్ర లేదని కూడా న్యాయమూర్తి చెప్పారు. ఈ రోజు పదినిమిషాల పాటు సాగిన విచారణ అనంతరం నిందితులు మసీదును కూల్చివేసేందుకు కుట్రపన్నారన్న ఆరోపణకు సిబిఐ సరైన సాక్ష్యాలు చూపించలేకపోయిందని న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుగురు నిందితులు హాజరయ్యారు.
Lucknow: Security tighetened around Special CBI court. The court will pronounce its verdict today, in Babri Masjid demolition case. pic.twitter.com/ArCv47NDsB
— ANI UP (@ANINewsUP) September 30, 2020