లోక్ సభలో గందరగోళంలో గాని, స్పీకర్ ఆగ్రహించి మైక్ లు కట్ చేసినపుడు వినిపించే ఒక కంచుకంఠం రఘవంశ్ ప్రసాద్ సింగ్ ది. బీహారీ పంచెకట్టు,సభ దద్దరిల్లే కంచుకంఠం ఆయన ట్రేడ్ మార్క్.
సభలో ఎపుడూ- మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా- చాలా యాక్టివ్ గా ఉండే సభ్యుడు. మొన్నమొన్నటి దాకా బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్ జెడి పార్టీకి నేషనల్ వైస్ ప్రెశిడెంట్ గా ఉండేవారు. ఆర్ జెడికి ఆయన ఢిల్లీ అడ్రసు లాంటి వ్యక్తి. లాలూ, రఘువంశ్ స్నేహం చూసిన వాళ్లెవరూ ఆయన పార్టీని వీడతారునుకోరు. రాజకీయాలంతే ఎపుడూ చిత్రమయిన మలుపులు తిరుగు ఉంటాయి.
యుపిఎ ప్రభుత్వంలో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నపుడే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం (MGNREGA) ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీలోని ఈ రోజు ఎయిమ్స్ లో కరోనా అనంతర సమస్యలతో ఆయన మృతి చెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
లాలూ ప్రసాద్ కు ఆయన ఒకపుడు కొండంత అండ. ఇలాంటి వ్యక్తుల మధ్య విబేధాలొచ్చాయి. పార్టీకి ఆయన రాజీనామాచేయాల్సివచ్చేదాకా వెళ్లింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నాయకత్వంలోని జెడి (యు)లో చేరతారని అనుకుంటున్నారు.
ఆయన అచ్చం పల్లెటూరి మనిషిలాగా కనిపిస్తారు. అయితే, మంచి విద్యావంతుడు. మ్యాధెమ్యాటిక్స్ డాక్టరేట్ చేసిన సభ్యడు. ఆయనను చూస్తే ఎవరూ నమ్మలేని సత్యమిది. బీహార్ రైతు ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి ఎపుడూ ఆయన రైతు జీవితం విస్మరించలేదు. పార్లమెంటు లో రైతులు సమస్యల మీద లోతుగా మాట్లాడే నాయకుల్లో ఆయన ఒకరు. గతంలో ఆహారం సవిల్ సప్లయ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ఎన్ని విమర్శలొచ్చినా, దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనలో విజయవంతమయిన పథకం MGNREGA లోని అనేక అంశాలుఆయనసూచించినవే చెబుతారు.
రఘవంశ్ ప్రసాద్ సింగ్ అయిదు సార్లు లోక్సభ కు వైశాలినుంచి ఎంపికయ్యారు. ఒకపుడు ఎదురులేని శక్తి అయినా 2014,2019 లోక్సభ ఎన్నికల్లో రఘువంశ్ ప్రసాద్ ఓడిపోయారు.
లాలూ ప్రసాద్ జైలు పాలయ్యాక పార్టీలో వచ్చిన మార్పుల్లో ఆయన నిర్లక్ష్యానికి గురయ్యారు. కొత్త రక్తం లాలూప్రసాద్ కుమారుడు తేజస్వి నాయకత్వం స్వీకరించాక ఆయన పార్టీకి దూరమవడం మొదలయింది.
प्रिय रघुवंश बाबू! ये आपने क्या किया?
मैनें परसों ही आपसे कहा था आप कहीं नहीं जा रहे है। लेकिन आप इतनी दूर चले गए।
नि:शब्द हूँ। दुःखी हूँ। बहुत याद आएँगे।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 13, 2020