ఆయన పేరు డాక్టర్ తవ్వా వెంకటయ్య. ఊరు తవ్వావారి పల్లె, ఖాజీ పెట మండలం, కడప జిల్లా.
దళిత కుటుంబం నుంచి వచ్చి వెంకటయ్య కడప యోగివేమన యూనివర్శిటి నుంచి తెలుగు సాహిత్యంలో పిహెచ్ డి చేశారు. తర్వాత ఖాజీపేటలోని ఒక ప్రయివేటు డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
కూలీల కుటుంబ నేపథ్యం. కష్టాలుఎన్నున్నా చదువుకు ప్రాముఖ్యం ఇచ్చి పిహె చ్ డి దాకా వెళ్లారు. తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన పరిశోధనా కృషికి మంచి ప్రశంలొచ్చాయి. బహుమానాలొచ్చాయి. సన్మానాలు జరిగదాయి. ‘రాయలసమీ కథానికి తొలిదశ: ఒక అధ్యయన’ పేరుతో ఆయన ఆధునిక కథల అవిర్భావం రాయలసీమలో ఎపుడు జరిగిందో శోధించి 115 తొలి నాళ్ల కథలను పట్టుకొచ్చారు.
‘సీమ కథా తొలకరి’ పేరుతో మరొక పుస్తకం తీసుకువచ్చారు. ఇది కథల మీద ఆయ రాసిన వ్యాసాల సంకలనం
రాయలసీమలో తొలికథ 1941లో జి రామకృష్ణ రాసిన ‘చిరంజీవి’ అని అంతా కుంటున్న రోజుల్లో ఆయన రాయలసీమ కథని 1918 దాకా తీసుకువెళ్లారు. ఇలా 1918 -1941 మధ్యవచ్చిన 115 కథలను వెలికితీశారు. ఇందులో 50 కథలను ‘రాయలసీమ తొలి తరం కథలు’ పేర సొంతడబ్బుతో ప్రచరించారు కూడా.
2014లో పిహెచ్ డి పూర్తికాగానే ఆయన ఖాజీపేటలోని ఒకప్రయివేటు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
అయితే, కోవిడ్ లాక్ డౌన్ తో ఆయన కథ అడ్డం తిరిగింది. బతకుబంది చతికిల బడింది. కాలేజీ యాజమాన్యంజీతాలు చెల్లించలేని స్థితిలో పడింది.తవ్వా వెంకటయ్య కష్టాల్లోపడ్డారు. ఇపుడాయనే ఒక కథగా మారారు. ఆయన జీవితం రాకపోవడం కుటుంబ పోషణ కరువుయింది.
తల్లితండ్రులు, తనకొక కూతురు, డిగ్రీ చదువుతున్న తమ్ముడు ఉన్నకుటుంబానికి తానే ఇంతవరకు అండగా ఉండేవాడు. ఇపుడు కూడా ఉండాలి. అందుకే ఇంతవరకు సుద్దముక్కను చేతపట్టి పలుగు పార పడుతున్నాడు. బేల్దార్ గా మారారు. నిర్మాణపుకూలీగా అవతారమెత్తారు.
తానేపనయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ కు వెంకటయ్య చెప్పారు.బేల్దార్ పనికిపోతున్నానని ఇందులో రోజు రు.500 దాకా గిడుతుందనిఆయన చెప్పారు. అయితే, ఇపుడు వర్షాల వల్ల వరినాట్లు పడుతున్నందున బేల్దార్ పనులు కూడా తగ్గాయని ఆయన చెప్పారు. తన చదవు వల్ల చుట్టు పక్కల పనులు దొరకడం లేదని తన దీనావస్థ గురించి చెప్పారు. ‘ కూలికి వస్తాను. ఏదైనా పని ఇవ్వండని అడిగితే, అంత పెద్ద చదవుచదివావు, నువ్వేంపనిచేస్తావులే,’అని కూలి పనికూడా ఇవ్వడం లేదని వెంకటయ్య చెప్పారు. అందుకేతెలిసిన వాళ్లెవరూ కనపించనంత దూరంగా వెళ్లి, చదువుకోలేదనిచెప్పి కూలీ పని చేస్తున్నానని ఆయన అన్నారు. తాను చదువుకొనక పోయివుంటే మా వూర్లో నే పనిదొరికేది, ఇపుడ ఈ కూలీపనికోసంచదువుకోలేదని అబద్దం చెప్పడమేకాదు, వూరికిదూరంగా వచ్చి పనివెదుక్కుంటున్నానని ఆయన చెప్పారు.
తన చదువు, తన పిహెచ్ డిలు ఇపుడు అడ్డంకి గా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నా, నాకు ఆంధ్రప్రదేశ్ గాని, రాయలసీమ గాని ఏమీ ఇవ్వకపోయినా, నేనయితే, రాయలసీమకు ఈ ప్రాంతంలో పుట్టిన రుణం తీర్చుకున్నారు. సాహిత్యంలో రాయలసీమ ఏ ఇతర ప్రాంతాలకు తీసిపోలేదేని, కథా సాంప్రదాయం ఇక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో లాగానే మొగ్గ తొడిగి వికిసించిందని పరిశోధించిచూపించి పుస్తకాలందించాను.
‘ఒకె, జీవితం లో ఇదొక దశ. కూలిపని చేస్తున్నందుకు బాధగా లేదు. నేనొచ్చిందీ కూలినుంచే. నేనొచ్చింది ఈ మట్టి పని నుంచే. అయితే, పిహెచ్ డి చేశావ్ నువ్వే పనిచేస్తావ్ లేబ్బా, వద్దులే, ’ అని డాక్టర్ వెంకటయ్యను కూలిపనికి కూడా పనికిరావని చాలా చోట్ల అనడమే బాధగా ఉంది. అందుకూ వూరికి దూరంగా వచ్చి పనిచేస్తున్నా’ననని ఆయన చెప్పారు.
డాక్టర వెంకటయ్యకు సాయం చేసేందుకు మిత్రులు కృషి చేస్తున్నారు.సాహిత్యాభిమానులు ముందుకు వచ్చి సాయంచేయాలని కడప జిల్లాకు చెందిన మరొక టీచర్ గొంటిముక్కల గోవింద్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంత చిన్న మొత్తమయిన సాయమే, ఎంత చిన్నమొత్తమయిన సరే 9160450104 Google pay & phone pay కి పంపాలని గోవింద్ కోరుతున్నారు.
డాక్టర్ తవ్వా వెంకటయ్య మొబైల్ నెంబర్ : 9703912727