నిమ్మగడ్డ రమేష్ ను రాష్ట్ర ఇసి గా నియమించండి: గవర్నర్ ఆదేశాలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍గా నిమ్మగడ్డ రమేశ్‍కుమార్‍ బాధ్యతలను స్వీకరించేందుకు రంగం సిద్దమయింది. ఆయనను కోర్టు ఉత్తర్వలు ప్రకారం  రాష్ట్ర ఎన్నికల కమిషనర్  తిరిగి నియమించాలని గవర్నర్ ఆదేశించారు.  రమేష్ కుమార్ సమర్పించిన వినతి పత్రానికి స్పందిస్తూ  గవర్నర్ బిశ్వభూషణ్  ఆదేశాలు పంపించారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి రమేష్ కుమార్ కు లేఖ రాశారు .  రమేష్ కుమార్ వేసిన కోర్టు ధిక్కార కేసుతో పాటు రిట్ పిటిషన్ నెంబర్  8163 (2020) మీద  హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల  ప్రకారం ఎస్‍ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‍కుమార్‍ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

…the Hon’ble Governor after examining the representation, order in the contempt case and Hon’ble High Court order in W.P No 8163 of 2020 has been pleased to direct the government for taking necessary action as per the direction of the Hon’ble High Court of A.P in its order in W.P No.  8163 of 202 dated 29.5.2020

బ్యాక్ గ్రౌండ్ స్టోరీ
 రమేష్ కుమార్ మరొ క ఏడాది పాటు సర్వీసు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. అంతేకాదు, ఆయన స్థానంలో మాజీ న్యాయమూర్తి కనకరాజు నియమించింది.
ఈ ఆర్డినెన్స్ చెల్లదని రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతోపాటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను సంస్కరించే పేరుతో కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ వచ్చిన ఈ ఆర్డినెన్స్ మరికొంత మంది కూడా సవాల్ చేశారు.వీరిలో మాజీ మంత్రి,బిజెపి నేత డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఒకరు.
 ఆర్డినెన్స్ లోని మరొక ముఖ్యాంశం, రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని కాకుండా రిటైర్డు న్యాయమూర్తిని ఈ   పోస్టుకునియమించాలనుకోవడం. ఈ నిర్ణయాల వెనక రాజకీయ దురుద్దేశాలున్నాయని పిటిషనర్లుంతా వాదించారు. దానికి తోడు ఆర్డినెన్స రాజ్యంగ వ్యతిరేకమని కూడా వారు వాదించారు.
కోవిడ్ కారణంగాదేశంలో పరిస్థితులు మారిపోవడంతో రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేయడంతో రాష్ట్రప్రభుత్వానికి, కమిషన్ కు వివాదం మొదలయింది. దీనితో కమిషనర్ ఏకంగా తొలగించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్క కు తీసుకువచ్చి రమేష్ కుమార్ ను తొలగించడం రాష్ట్రంలో బాగా చర్చీనీయాంశమయింది.
ఇది చెల్లదని చెబుతూ ఒక పిల్  హైకోర్టు లో దాఖలయింది. దీని వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఆయనను ఎన్నికల కమిషనర్ గా పునర్నియమిస్తూ తీర్పు ఇచ్చింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపి ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలని మే 29న హైకోర్టు తీర్పు నిచ్చింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంస్కరణ పేరుతో  నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఈ రోజు  కొట్టివేస్తూ  ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు పేర్కొంది.
రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా తక్షణం విధుల్లోకి వస్తారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది
ప్రభుత్వం  తొలగించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  విధుల్లో కొనసాగుతున్నట్లే నని కోర్టు పేర్కొంది.
కోర్టు ధిక్కారం
అయితే, హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదు. దీని మీద రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ కార్యదర్శిల మీద చర్య తీసుకోవాలని హైకోర్టు లో జూన్ 25న ధిక్కార పిటిషన్ కూడా వేశారు.
సుప్రీం కోర్టు కెళ్లినవివాదం
హైకోర్టు ఉత్తర్వుల మీద స్టేఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూనే స్టే ఇవ్వడం కుదరదని జూన్ 11న ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, జస్టిస్ కనకరాను, కమిషనర్ గానియమించడం, రమేష్ కుమార్ ను తొలగించడం కోసం జారీచేసిన ఆర్డినెన్స్ అనుమానాలకు తావిచ్చేలా ఉందని కూడా సుప్రీంకోర్టు  వ్యాఖ్యానించింది.
 సుప్రీం స్టే నిరాకరణతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయాల్సి ఉంది. దీనితో తన నియమాకం అమలుచేయాలని రమేష్ కుమార్ మళ్లీ హైకోర్టుకు వచ్చారు. కోర్టు ఆయన పిటిషన్ ని స్వీకరిస్తూ, తనను నియమించేందుకు ఉత్తర్వులివ్వాలని గవర్నర్ ను కోరాలని కోర్టు అదేశించింది. ఈ మేరకు రమేష్ కుమార్ గవర్నర్ నుకలిశారు. దాని ఫలితమే నేటి ఉత్తర్వులు.