ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉండటంతో అందునా విజయవాడలో మరీ తీవ్రంగా ఉండటం అక్కడ రేపటినుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదివారం వరకు మూసేస్తున్నారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. ఈమేరకు హైకోర్టునుంచి ఒక ప్రకటన విడుదలయింది. ఇదే విధంగా విజయవాడలోని సెషన్స్ జడ్జి కోర్టు ను కూడా బంద్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 553 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే విధంగా కోవిడ్-19 వల్ల ఏడుగురు మృతి చెందారు. మృతులకుసంబంధించి కృష్ణా జిల్లా లో 2, కర్నూల్ జిల్లా లో ఇద్దరు, గుంటూరు నుంచి ఇద్దరు, తూర్పు గోదావరి ఒక్కరు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటీన్ విడుదల చేసింది.
కొత్తగా నమోదయిన కేసులలో రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 477 ఉంటే 66 కేసులు ఇతర రాష్ట్రాలనుంచి, ఇతరదేశాల నుంచి వచ్చిన వారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10884కి చేరుకుంది. కరోనా పరీక్షల కు సంబంధించి గడిచిన 24 గంటల్లో మొత్తం 19085 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి రాాష్ఖ్రంలో 136 మంది మరణించారు.