10 సింపుల్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, జవాబులు తెలుసేమో చూడండి

1. 1954 ఏప్రిల్ 29న భారత్-చైనా మధ్య పంచశీల్ ఒప్పందం జరిగింది. దీని అసలు పేరు Agreement on Trade and Intercourse between the Tibet region of China and India. ఈ పంచీశీల ఒప్పందం మీద సంతకాలు చేసిందెవరు?
ఎ) భారత ప్రధాని నెహ్రూ- చైనా చెయిర్మన్ మావొజెడాంగ్, బి) నెహ్రూ- చైనాప్రధాని జౌఎన్ లై, సి) చైనా ప్రధాని జౌ ఎన్ లై- లాల్ బహదూర్ శాస్త్రి, డ)భారత రాయబారి ఎన్ రాఘవన్- చైనా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చాంగ్ హాన్ ఫు.
2. పంచీశీల ఒప్పందం మీద సంతకాలు చేసిన సమావేశం ఎక్కడ జరిగింది
ఎ) బీజింగ్ బి) న్యూఢిల్లీ, సి) లాసా, డి) తాస్కెంట్
3. ఇపుడు మనం తైవాన్ అని పిలుసున్న దీవి పూర్వపు పేరేమిటి
ఎ) ఫార్మోజా బి) స్ప్రాట్లీ ఐలాండ్ సి) నతూన ఐలెండ్స్ డి) యాగాంగ్ ఐలాండ్
4. టిబెట్ మీద చైనా ప్రభుత్వం పెత్త నాన్ని వ్యతిరేకిస్తూ దలైలామా 80 వేల మంది అనుచరులతో భారతదేశానికి వచ్చి రాజకీయాశ్రయం తీసుకుని ప్రవాస ప్రభుత్వం (Government-in-exile) ఏర్పాటుచేశారు.ఆయన ఇండియాలో ఎపుడు ప్రవేశించారు?
ఎ) 1962 బి)1949 సి)1959. డి) 1954
5.లదాక్ లోని గాల్వాన్ వ్యాలీ పేరు ఇపుడు రోజూ వినబడుతూ ఉంది. ఆ లోయకు ఆ పేరు అక్కడ ఉన్న నది వల్ల వచ్చింది. ఆనదికి ఆ పేరు గులాం రసూల్ గాల్వాన్ అనే వ్యక్తి గౌరవార్థం బ్రిటిష్ వాళ్లు పెట్టారు. బతికుండగానే ఒక నదికి ఒక వ్యక్తి పేరు పెట్టడం చరిత్రలో ఎపుడూ జరగలేదు. గులామ్ రసూల్ గాల్వాన్ కు ఆ మహద్భాగ్యం లభించింది. ఇంతకు ఆ గాల్వాన్ ఎవరు?
ఎ) బ్రిటిష్ అధికారి బి) లదాక్ రాజు సి) చరిత్రకారుడు డి) మూటలు మోసే కూలీ.
6.1962లో జరిగిన ఇండో చైనా యుద్ధం మీద ఆస్ట్రేలియా జర్నలిస్టు ఒకరు ఒకసంచలనాత్మక పుస్తకం రాశారు. యుద్ధసమయంలో ఆయన టైమ్స్ పత్రికకు న్యూఢిల్లీ కరెస్పాండెంటుంగా ఉన్నారు. భారత సైన్యం నుంచే సేకరించిన వివరాల అధారంగా ఈపుస్తకం రాశారు.  ఈపుస్తకం పేరు India’s China War . ఆ జర్నలిస్టు పేరేంటి
ఎ) మార్క్ టుల్లీ బి) నివెల్ మాక్స్ వెల్. సి) జార్జ్ యాండర్సన్ డి) రాబిన్ జెఫ్రీ
7. 1962లో ఇండో చైనా యుద్ధం ఎపుడు మొదలైంది. రెండు ప్రాంతాల్లోనుంచి ఇండియా మీ  చైనా దాడి చేసింది. ఇందులో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్కాచూ నది సమీపంలో. రెండవ ప్రాంతం లదాక్. చైనా ఏతేదీన ఈ దాడి జరిపింది.
ఎ) అక్టోబర్ 20. బి) అక్టోబర్ 13 సి)అక్టోబర్ 2 డి) సెప్టెంబర్ 6
8. భారత చైనా యుద్ధం ఏ తేదీన ముగిసింది.
ఎ) నవంబర్ 1  బి) నవంబర్ 4  సి) నవంబర్ 7 డి)నవంబర్ 20.
9.1954లో ప్రధాని నెహ్రూ చైనా సందర్శించారు. అక్కడ ఛైర్మన్ మావోజెడాంగ్ ను కలిశారు. ఆయన అవాక్కయేంత చైనీయులు నుంచి నెహ్రూకు అఖండ స్వాగతం లభించింది. ఆనందంతో భారత ప్రధాని ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇండియాకు తిరిగొచ్చాక ఆయన ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అదేంటంటే People of China  do not want war with India. ఈ ప్రకటనని ఆయన ఒక బహిరంగ సభలో చేశారు ఈ సభ ఎక్కడ జరిగింది.
ఎ) న్యూఢిల్లీ   బి)ముంబై  సి) కలకత్తా. డి) అమృత్ సర్
10. 1959లో ఇండియాలోకి టిబెట్ బౌద్ధ గురువు దలైలామ ఏ రాష్ట్రం గుండా ప్రవేశించారు.
ఎ) హిమాచల్ ప్రదేశ్ బి) జమ్ముకాశ్మీర్ సి) పశ్చిమబెంగాల్ డి) అరుణాచల్ ప్రదేశ్.
నిన్నటి ప్రశ్న
ప్రపంచంలో అత్యంత విశాలమయిన మర్రి చెట్టు ఇది. వయసు 250 సం. విస్తీర్ణం 330 మీ. ఇదెక్కడుంది?
సమాధానం: కోల్ కతా
వివరణ : ఈ మర్రిచెట్టు కోల్ కతా సమీపంలోని శిబ్ పూర్ లో ఉన్న ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్స్ లో ఉంది.
ఈ తోటకి ఈ మహామర్రి (Ficus Benghalensis)యే చిహ్నం. ప్రపంచంలో అత్యంత విశాలమయిన మర్రి చెట్టు ఇది. వయసు 250 సం. విస్తీర్ణం 330 మీటర్లు.
ఈ గార్డెన్ ని బ్రిటిస్ ఈస్టిండియా కంపెనీకి చెందిన కర్నల్ రాబర్ట్హ కైడ్ (Col Robert Kyd) 1787 లో ఏర్పాటుచేశారు.
మొదట్లో ఈ ఉద్యాన వనాన్ని బాగా కమర్షియల్ విలువ ఉన్న టేకు, మహగొని,రబ్బర్ , అపుడే చైనానుంచి పరిచయమయిన టీ తోటలను పెంచేందుకు ఉద్దేశించారు. తర్వాత దీనిని సుమారు 2,50,000 వేల రకాల మొక్కలు పెంచే హర్బేరియంగా మార్చారు.
తేయాకు పంటని భారతదేశంలో వ్యాప్తి చేసింది ఈ తోటయే.1860 దశాబ్దంలో ఈ తోటలో సింకోనా  (Cinchona Officinalis, family: Rubiaceae) చెట్ల పెంకపకం మొదలు పెట్టారు. ఆరోజుకి వాళ్లకి తెలుసోతెలియదో కాని, తర్వాత ఈ చెట్టుబెరడు నుంచి మలేరియా మందు క్వినైన్ తయారయింది.
వేలాది రకాల చెట్ల పచ్చదనంతో, వాటి ఆకుల కొమ్మల, రెమ్మల  సవ్వడితో,  వాటి మీద నివసించే పక్షల కిలకిలారావాలతో, రకరకాల జంతువుల సంచారాలతో బయోడైవర్సిటీ విశ్వరూపం ఈ ఉద్యానవనంలో చూడవచ్చు.
మొదట్లో దీనిని కంపెనీ బాగన్ (Company Bagan) అని పిలిచేవారు. తర్వాత ఇదే ఇండియన్ బొటానిక్ గార్డెన్ ఆపైన  కలకత్తా బొటానిక్ గార్డెన్ అయింది. ఆ తర్వాత 2009లో  ప్రఖ్యాత వృక్ష భౌతిక  శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ గౌరవార్థం ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్  అని దీనికి పేరు మార్చారు.

Best of Luck

Like this post? Please share it with friends!