ఈ రోజు మాస్క్ లేకుండా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన జగన్

ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ ధరించకుండా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ అధికారులతో మాట్లాడారు. ఓటు వేశారు. దేశమంతా ఈ రోజు 20 రాజ్యసభస్థానాలకు అసెంబ్లీలలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాాష్ట్రంలో  అనే జిల్లాల్లో మాస్క్ ధరించడం  కంపల్సరీ చేశారు.
అయితే, ఆయన మాస్క్ ధరించకుండా బయటకు తిరిగారని వేరే చెప్పాల్సిన పనిలేదు.ఈ పోటోలను ప్రభుత్వాధికారులు అసలు విషయం మర్చిపోయి పత్రికలకు వారికి ఎప్పటిలా గే అందించారు. అయితే, ముఖ్యమంత్రి మాస్క్ ధరించలేదన్న విషయాన్ని చాలా మంది నెటిజన్లు గ్రహించారు. ఈఫోటోలను  తెగు షేర్ చేస్తున్నారు.

వ్యాక్సిన్ తయారీ ఒప్పంద కార్యక్రమంలో…

టూరిజం వారి బోట్ కంట్రోల్ రూం ప్రారంభం…

ఆంధ్రలో ఈ రోజు కొత్త కరోనా కేసులు 376, బాగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు

దేశమంతా కోవిడ్ పరీక్షలకు ఒకే  రేటు: సుప్రీం కోర్టు

కోవిడ్-19 టెస్టులకు దేశమంతా ఒక ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ విషయాన్ని రాష్ట్రాలకు వదిలేయాలన్న కేంద్రం వాదనను కోర్టు అంగీకరించలేదు. కోవిడ్ పరీక్షలకు వసూలు చేస్తున్నఫీజుకు కనీసం దేశమంతా ఒకే గరిష్ట పరిమితి ఉండటం అవసరమని అభిప్రాయపడింది.
కోవిడ్ చికిత్స, రోగుల కష్టాలు, కోవిడ్ మృతదేహాల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాల మీద ఒక సూమోటు కేసులో జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సూచనలిచ్చింది. ‘ పరీక్షలకు వసూలు చేస్తున్న రుసుం దేశమంతా ఒకే విధంగా ఉండాలి. ఇపుడు కొన్ని రాష్ట్రాలలో ఇది రు. 2,200 ఉంది. మరికొన్ని రాష్ట్రాలలో రు. 4,500 లుగా ఉంది. అయితే, మేం ఈ ధరలను నిర్ణయించలేదు. ప్రభుత్వమే నిర్ణయించాలి,’ అని ధర్మాసనం తెలిపింది. సాలిసిటిటర్ జనరల్ తుషార్ మెహ్తా మాత్రం ధరలను నిర్ణయించే వ్యవహారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే బాగుటుందని సూచించారు. కొన్ని రాష్ట్రాలు ఇంకా తక్కువ ధరలు నిర్ణయించేందుకు చర్చలు జరుపుతున్నాయని ఆయన కోర్టు తెలిపారు. దీనికి స్పందిస్తూ మీరు గరిష్టపరిమితి విధించడం, మిగతా పని రాష్ట్రాలు చూసుకుంటాయని జస్టిస్అశోక్ భూషన్ తెలిపారు. ధర్మాసనంలో ఇంకా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎం, ఆర్ షా ఉన్నారు.
coronavirus (Pic credits: China academy of sciences)
ఆంధ్ర ప్రదేశ్ కరోనా యాక్టివ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. దీనిని బట్టి ముందుముందు రాష్ట్రంలో భారీగా కోవిడ్ కేసులకు పడకలు అవసరం రావచ్చని భావిస్తున్నారు. గత 24 గంటలలో  376కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  అయితే, ఇదే సమయంలో డిశ్చార్ అయిన వారు  కేవలం 82   మంది మాత్రమే. నలుగుర వ్యక్తులు మరణించారు ఇందులో ఇద్దరు కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం, శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్కరేసి చనిపోయారు.
 నేటితో రాష్ట్రంలోని కొత్త కేసుల సంఖ్య అమాంతం 6320కి పెరిగింది. మొత్తం డిశ్చార్జ్ అయినవారు 3065 మంది కాగా యాక్టివ్ కరోనా కేసులు 3019 అని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒకబులెటీన్ లో పేర్కొంది.
రాష్ట్రంలోని పాటిటివ్ కేసులలో ఇతరదేశాలనుంచి వచ్చిన వారు 308 కాాగా వారిలో యాక్టివ్ కేసులు 261.  ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు 1423 మంది ఉన్నారు. వారిలో యాక్టివ్ కేసులు 630.
జాతీయ స్థాయిలో కోవిడ్ 
శుక్రవారంనాడు కొత్తగా భారతదేశంలో 13, 586 కేసులునమోదకావడంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,80,532 కు చేరింది. ఒక రోజు  పదమూడున్న వేల కేసులు నమోదుకావడం ఒక రికార్డు. ఇదే విధంగా 336 మరణాలు కూడా నమోదయ్యాయి. దీనితో మొత్తం కరోనా మరణాల సంఖ్య12,573 కు పెరిగింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ బులెటన్ లో వెల్లడించింది.
10 భారత సైనికులను విడుదల చేసిన చైనా
పది మంది భారతీయ సైనికులను చైనా విడుదలచేసింది. వీరందనిరిన సోమవారం రాత్రి గాల్వాన్ లోయలో భారతీయ సైనికుల మీద దాడిజరిపినపుడు పట్టుకున్నారు. ఈ దాడిలో తెలంగాణ కు చెందిన కర్నల్ సంతోష్ భాబుతో పాటు 20 మంది సైనికులు చనిపోయారు. అనంతరం దౌత్యస్థాయిలో మిలిటరీ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చలుజరిగాయి. ఫలితంగా 10 మంది సైనికులను చైనా విడుదల చేసింది.
గురువారం నాడు వీరంతా లైన్ ఆప్ యాక్చవల్ కంట్రోల్ (LAC)దాటుకుని భారత్ వైపు వచ్చారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
ఈ పదిమందిలో ఇద్దరు ఆఫీసర్లు కూడా ఉన్నారు. సైనికుల భద్రతా కారణాల రీత్యా ఈచర్చలను బాగ గా గోప్యంగా ఉంచారని ఈ పత్రిక అన్ లైన్ ఎడిషన్ లో రాసింది. అయితే దీని మీద ఇంతవరకు అధికారిక ప్రకటనల వెలువడలేదు. గాల్వాన్ వ్యాలీలో పెట్రోల్ పాయింట్ వద్ద మంగళవారం,గురువారంనాడు మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరిగాయి.

 

ఆంధ్ర రౌండప్ 

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.తమ వాదనలు వినాలని కోరిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోరారు.బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వినాలన్నా న్యాయవాది. విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
ఏపీ టూరిజం బోట్ కంట్రోల్ రూమ్ లను ప్రారంభించిన సీఎం జగన్…

కంట్రోల్‌ రూమ్స్‌ వద్దనున్న కలెక్టర్లనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
రాష్ట్రంలో మొత్తం 9 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌
ప.గో.జిల్లా సింగనపల్లి
తూ.గో.జిల్లా గండి పోచమ్మ
ప.గో.జిల్లా పేరంటాలపల్లి
ప.గో.జిల్లా పోచవరం
తూ.గో.జిల్లా రాజమండ్రి
విశాఖ జిల్లా రుషి కొండ
గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌
కర్నూలు జిల్లా శ్రీశైలం
కృష్ణాజిల్లా విజయవాడలోని బెరం పార్క్‌
. లైసెన్సింగ్‌ విధానం పై కూడా ప్రత్యేక ఎస్‌ఓపీలను రూపొందించి ఆమేరకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ చెప్పారు. మళ్లీ అలాంటి ప్రమాదం జరగకుండా ఏంచేయాలన్నదానిపై మనం ఆలోచనలు చేసి.. ఈ కంట్రోల్‌ రూంలను తీసుకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు స్పందించి తర్వాత వదిలేయడం కాకుండా ఒక అడుగు ముందుకేసి మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామనిజగన్ చెప్పారు.
జగన్ ప్రభుత్వం బిసి లపై తీరు మారకుంటే  ఉద్యమం 
అన్ని పార్టీల్లోని బిసి ల మనోభావాలు దెబ్బతినే విధంగా  ముఖ్యమంత్రి జగన్  పరిపాలన తీరు ఉందని మంగళగిరి టిడిపి నాయకులు గంజి చిరంజీవి అన్నారు. వైకాపా ఏడాది పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ’జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పై ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు గమనించారు. అపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 500 కిలో మీటర్లు వాహనంలో తిప్పి మరల తిరిగి అపరేషన్ చేయించుకునే పరిస్దితి కల్పించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు నమోదు చేశారు.బిసిల ప్రగతే మా పార్టీ లక్ష్యం అని ఓట్లు సీట్లు సంపాదించుకున్నారు. అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు తొలగించాలి. మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఇందులో టిడిపి నాయకులు నందం అబద్దయ్య, ఆరుద్ర భూలక్ష్మీ, రేఖా సుధాకర్ గౌడ్, మున్నంగి శేషాగిరిరావు, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల రాజు తదితరులు పాల్గోన్నారు.
సారీ, రాజ్యసభ ఎన్నికల్లో వోటేయలేను, చంద్రబాబు కు ఎమ్మెల్యే లేఖ
కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నానని రేపల్లె శాసన సభ్యుడు సత్యప్రసాద్ టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడికి లేఖ రాసి షాకిచ్చారు. ఇదే లెటర్.
నేను ఇటీవల కాలంలో వ్యాపార రీత్యా తెలంగాణ రాష్ట్రం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి ని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆయనను కలిసిన నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నాను. కనుక ఈ రోజు (19)న జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కు డాక్టర్ సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారి ఈ నేపథ్యంలో ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను మన్నించగలరని ప్రార్థన. తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది. పార్టీకి ఏ అవసరం వచ్చినా ముందుండే నేను ఈ విషయంలో రాలేక పోతున్నాను. కనుక నన్ను మన్నించగలరు. పార్టీకి అవసరమైనప్పుడు ఎల్లవేళలా ముందుంటానని, మీ ఆశీస్సులు, భగవంతుని దయ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ విధేయుడు
అనగాని సత్యప్రసాద్
రేపల్లె శాసనసభ్యులు.

జెసి ప్రభాకర్ అండ్ సన్ కు బెయిలు నిరాకరణ

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిలు దొరకలేదు. అశోక్ లే లాండ్ తుక్కు వాహనాలను కొన్ని కొత్త వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో వారిద్దరని పోలీసులు అరెస్టుచేశారు. తమకు బెయిల్ కావాలంటూ వారిద్దరు ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తు అనంతపురం జిల్లా కోర్టు తిరస్కరించించింది. వారిద్దరు కడప జైలులో ఉన్నారు.
మరొక మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలను పీటీ వారెంట్‌పై అనంతపురం వన్‌టౌన్ పోలీసులు కస్టడీకి కోరారు . ఈ నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది

తెలంగాణ నుంచి ఆంధ్రాకు భారీగా జోరుగా మద్యం స్మగ్లింగ్

మచిలీపట్నం: తెలంగాణ లోని ఖమ్మం జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన దివ్యభారతి, మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు ఆంధ్రకు మద్యం తరిలిస్తుండగా పట్టుబడ్డార. AP 28 AN 9717 టాటా ఇండికా కారులో 20 కేసులలో మొత్తం 1056 మద్యం బాటిల్ ఎక్కించి వాటిని నందిగామ తరలించే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసు ప్రత్యేక బృందం ఎస్ఐ మురళీకృష్ణ, సాండ్ మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట్యాలవారి గూడెం వద్ద వాహన తనిఖీలు చేస్తున్నపుడు ఈ కారు కనిపించింది. అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వాహన డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు కారును అపి తనిఖీ చేయటంతో 1,056 మద్యం బాటిళ్లు కనిపించాయి. ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిరువురిపై వత్సవాయి పోలీస్ స్టేషన్లో  ఎక్సైజ్ కేసు నమోదు చేశారు.

 ప్రధాని అఖిల పక్ష సమావేశానికి టీడీపీ  ఆహ్వానం లేనట్లే…

చైనా దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటుచేస్తున్న అఖిల పక్ష వీడియో కాన్ఫరెన్సులు కు తెలుగుదేశం పార్టీకి ఈ మధ్యాహ్నం దాకా ఆహ్వానం అందలేదు. కేవలం  5 గురు ఎంపీ లు ఉన్న పార్టీల ను మాత్రమే అఖిల పక్ష సమావేశానికి పిలుస్తున్నారని, ఇపుడు నలుగురే ఎంపిలున్నందున టిడిపి ఆహ్వానం అందలదేని చెబుతున్నారు. 2 రోజుల క్రితమే టీడీపీ ఎంపీ సీతారామ లక్ష్మీ పదవీకాలం ముగియడంతో పడిపోయిన టీడీపీ ఎంపీల సంఖ్య నాలుగుకు పడిపోయింది. అయిత, టిడిపి వర్గాలు ఆంకా ఆశతోనే ఉన్నాయి.సాయంకాలం లోపు ఆహ్వానం అందవచ్చని భావిస్తున్నాయి.
పులివెందులో ఎనిమల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.  పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తికేంద్రంకోసం ఒప్పందం కుదిరింది.  2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ మొదలవుతుంది.  పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు ,అంటే గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్లరోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లు తయారవుతాయి. దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి తో   ఐజీవై ముందుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం  సదుపాయాలను అందిస్తుంది . ఇక్కడ  100 మంది నిపుణులకు, సిబ్బందికి ఉపాథి లభిస్తుంది.సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పందంపై ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం. శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి  సంతకాలు చేశారు.
.