యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు నివాళి

(పి.కె.వేణుగోపాల్)
సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య బాలీవుడ్ చిత్రసీమకు తీరని లోటు. ఈ ఆకస్మిక మృతి యువనటుల్లో తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రత్యేకంగా హిందీ సినిమా రంగంలో. ఎంతో కృషి ఫలితంగా, కష్టపడి మంచిపేరు సంపాదిస్తున్నా సుశాంత్ ఇటివలే సినిమా, టీవీ సీరియల్స్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఆయన నటజీవితం టివి సీరియల్ (Kis Desh Mein Hai Meraa Dil ,2008) తో మొదలయింది.   ఇతర సినీ ప్రముఖులు కన్నా తన ప్రత్యేకతను చాటుకుంటూ శరవేగంగా ముందుకు దూసుకువెళ్లుతున్నారు.
సుశాంత్ రాజ్ ఫుత్  బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఢిల్లీ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజిలో చదువుకున్నారు. ఆ సందర్భంగా డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించారు. మంచిగా నటనా నైపుణ్యం పొందుతున్నారు. ఈ క్రమంలోనే చేతన్ భగత్ నవల ఆధరంగా తీసిన “కై పొ చే” (Kai Po Che) సినిమాలో నటించారు. ప్రముఖ క్రికెట్ స్టార్ యంఎస్ ధోనీ జీవిత చరిత్ర “MS DhoniThe Untold Story బయెాపిక్ చిత్రంలో కూడా చాలా అద్భుతంగా నటించారు.
 జీ టివి సీరియల్ ‘పవిత్ర రిస్తా’, స్టార్ ఢమ్ వంటివాటిలో  నటిస్తూ అమీర్ ఖాన్ లాంటి ప్రముఖ బాలీవుడ్ సినీ దిగ్గజాలు స్థానంలో పేరు సంపాదించుకొవటానికి, సరితూగే ప్రయత్నం ప్రారంభించారు.
సినిమాలలో నిజజీవిత విశేషాలుండాలని, సామాన్యుని జీవిత గాధలు, పరిష్కారాలుండాలని భావించారు. సినిమాలో హింస, అశ్లీలం, సంస్కృతి సాంప్రదాయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. బాలీవుడ్ చిత్రసీమకు కొత్త అధ్యయనానికి తెరలేపిన యువనటుడుగా నిలిచాడు.
ప్రతి చిత్రంలో సాంఘిక నీతి ఉండాలని తపనపడేవాడు. పద్మావతి సినిమాలో దీపికా పడుకొన్ నటించిన పాత్రను హిందూ మతోన్మాద శక్తులు వ్యతిరేకించినపుడు, ఆ దాడులను సుశాంత్ తీవ్రంగా ఖండించారు. ఆ సమయంలో బాలీవుడ్ నటులేవరు నోరుమెదపలేదు. సుశాంత్ మాత్రం తీవ్రంగా ఖండించారు. పైగా ఏ రాజ్ ఫుత్ లు ఆ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించుతున్నారొ ఆ కోవకు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ వ్యతిరేకించటం సుశాంత్ విశేషం. పద్మావతి చిత్రాన్ని వ్యతిరేకించిన వారిని తప్పుపట్టిన బాలీవుడ్ నటుల్లొ సుశాంత్ ఒకరు.
2018వ సంవత్సరం కేరళలో వరద బీభత్సానికి జనం అతలాకుతలమైనపుడు సుశాంత్ తన అభిమాని  కోరిక మేరకు రూ. కోటి విరాళం ప్రభుత్వానికి అందించారు. మరో సందర్భంగా నాగలాండ్ రాష్ట్రంలో వరదల సందర్భంగా కూడా ప్రజలు సర్వం కోల్పోగా రూ.1.25 కోటి సాయం అందించారు. పకృతి వైపరీత్యాలపుడు మౌనంగా ఉండే బాలీవుడ్ నటులకు భిన్నంగా సామాజిక స్పృహతో తన వంతు సహాయం అందించారు. మానవత్వానికి చిహ్నంగా నిలిచారనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఏదీఏమైనా సామాజిక స్పృహ కలిగిన యువనటులు బహు అరుదు. బలవన్మరణం బాధకరం. తను వృత్తి సంబంధించిన లేదా వ్యక్తిగత కారణాలతో తీవ్రంగా మధనపడుతున్నారని, అంతర్గత ఘర్షణకు లోనవుతున్నారని అర్థం అవుతుంది.  పైగా కుటుంబ సభ్యులు సుశాంత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి రావలసి ఉంది. పూర్తిగా విచారణ చేయాలని డిమాండ్ చేద్దాం.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము. సామాజిక స్పృహ, లౌకికత్వం, మానవత్వం కలిగిన యువనటుడు సుశాంత్ ఆత్మహత్య భారత చిత్ర పరిశ్రమకు, సమాజానికి తీరని లోటు. ఇటువంటి యువనటులు నేటి సమాజానికీ దొరకడం బహుఅరుదు. అలాంటి మంచి నటులను భవిష్యత్ సమాజం ఆదరించాలని ఆశిస్తూ….

(పి.కె.వేణుగోపాల్ (PKV), కార్యదర్శి
ALL INDIA FORUM FOR PEOPLES CULTURE అఖిల భారత ప్రజా సాంస్కృతిక వేదిక)