(Srikanth Arja)
కోవిడ్19 భారత దేశంలో ఉపద్రవంగా మారలేదు. అమెరికా, రష్యా, యుకె, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలతో పోలిస్తే, భారత దేశం కోవిడ్ ను బాగా నియంత్రించినట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. విపత్తు నిర్వహణకు భారతదేశం పంచ సూత్రాలను పాటించింది. వాటి వివరాలు :
1. సామాజిక ప్రయోగం ద్వారా ఉద్దేశ్యాన్ని తెలపడం.
WHO సిఫారసు ప్రకారం “సామాజిక దూరం” అనేది COVID19 పై పోరాటానికి కీలక ఆయుధం గా మారింది.
సుమారు 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత దేశం లో మామూలు పరిస్థితుల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం అనేది కష్టమే గాని ఇది పూర్తి లాక్ డౌన్ ద్వారా మాత్రమే సాధ్యమతుంది.
ఇది సరైన ప్రయోగమే, కానీ అత్యంత తక్కువ సమయం లో దీనిపై పూర్తి అవగాహనా మరియు సరైన సమాచారము లేకుండా ఇన్ని కోట్ల మంది ప్రజలపై అమలు చేయడం అనేది అంత సులువైన పని కాదు.
దీనికోసం ప్రజలను ముందస్తుగా సిద్ద పరచడానికి ప్రధాని మోడీ “జనతా కర్ఫ్యూ” కు పిలుపునిచ్చారు. దేశం మొత్తాన్ని స్వచ్ఛందంగా 12 గంటలు ఇంట్లో ఉండమని అభ్యర్థించడం జరిగింది.
ఈ జనతా కర్ఫ్యూ అనుభవాలతో ఎదుర్కొన బోయే 21 రోజుల లాక్ డౌన్ ఇబ్బందులను అర్థం చేసుకోవడంలో సహాయపడటమే కాకుండా దానికి తగిన విధంగా ముందే సిద్ధపడడానికి ప్రజలకు ఒక అనుభవాన్ని ఇవ్వడంతో పాటు వారాంతం లో అమలు కారణంగా ఇది చాలా తక్కువ ఇబ్బందులకు గురి చేసింది.
ఈ జనతా కర్ఫ్యు “ఆరోగ్య కార్యకర్తలకు చప్పట్లు” అనే సామాజిక ప్రయోగం తో కలిపి పిలుపు ఇవ్వడం ద్వారా మనకు సహాయపడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు మనం చప్పట్లు కొట్టడం అనే కార్యక్రమం తో కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడం అనే సామాజిక ప్రయోగం విజయవంతం అవడం జరిగింది. ఇది ఒక విధంగా జనతా కర్ఫ్యూ కు సహ బలంగా తోడ్పడింది. మితమైన పరిపాలన యంత్రాంగం ద్వారా చాలా తక్కువ వనరులతో ఇది విజయవంతంగా అమలు చేయబడింది.
2.క్రియాశీలకమైన అడుగులు వేయడం.
అంతర్జాతీయ ప్రయాణ నిషేధాన్ని విధించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. ప్రయాణికుల విమానాలు ద్వారా మరియు రక్షణ శాఖ విమానాల ద్వారా నౌకా మార్గాల ద్వారా భారతదేశం లో కి ప్రవేశించిన సుమారు 1.5 మిలియన్ల మంది అంతర్జాతీయ ప్రయాణీకులను వ్యాధి లక్షణాలకై క్షుణ్ణంగా పరీక్షించడం తో పాటు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని నిర్బంధించడం మరియు తదుపరి నిఘా కొరకు వారి పూర్తి వివరాలను వారి సంబంధిత రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం అంతా 21 రోజుల లాక్ డౌన్ సమయం లో నిర్వహించడం జరిగింది. ఆర్థిక పరిణామాల దృష్ట్యా మొదట్లో దీనిని అనేక రంగాల నిపుణులు తీవ్రముగా విమర్శించడం జరిగింది , కాని తరువాత ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించడం తో పాటు మిగిలిన దేశాలు కూడా దీనిని అనుసరించడం ప్రారంభించాయి.
ఇది ఒక గొప్ప క్రియాశీలక విధానంగా WHO మరియు UN నిపుణులు ప్రశంసించడం జరిగింది. అంతే కాకుండా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ,వలస కార్మికులకు మద్దతు, ఇంటి వద్ద నుండే పని చేసే అవకాశాలు మరియు భారీ స్థాయిలో స్వచ్ఛంద సేవకుల అందుబాటు వంటి చర్యలతో ప్రభుత్వం సమగ్ర విధానాలను అనుసరించింది. ఒకవేళ భారత దేశం ఇలాంటి చర్యలు తీసుకుని ఉండకపోతే ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క “వృద్ధి-ఆధారిత విశ్లేషణ యొక్క గణాంక రేటు” అంచనా ప్రకారం, ఏప్రిల్ 15 నాటికి 41% సంచిత వృద్ధి రేటును నమోదు చేస్తూ సుమారు 8.2 లక్షల కేసులు వరకూ నమోదు అయ్యే అవకాశం ఉండేది.
3.ప్రజా నిర్వహణ
COVID ప్రభావం ప్రజల శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇది ప్రజలలో తీవ్ర ఒత్తిడిని కలిగించింది., దీని కారణంగా ప్రముఖ వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు లేదా గుండెపోటుతో మరణించారు.
ఐక్యతకు గుర్తుగా ప్రధాని మోడీ ఏప్రిల్ 9 న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు పాటు లైట్లు ఆపివేయాలని దీపాలను వెలిగించాలని 9pm ఫర్ 9మినిట్స్ చాలెంజ్ ప్రకటించారు.
విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఆ సమయం లో విద్యుత్తు డిమాండ్ 12GW వరకూ తగ్గుతుందని వారు ఊహించారు , కాని ఈ కార్యక్రమ సమయం లో వారు డిమాండ్ 32GW వరకూ తగ్గినట్లు గ్రహించారు, ఇది ఈ సవాలుకు ప్రజల నుండి అధిక స్పందనను రుజువు చేసింది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీపం వెలిగించడం మరియు కారణం కోసం నిలబడటం వంటివి మన లోని నిరాశావాదాన్ని నాశనం చేయడంలో సహాయపడతాయి.ఈ కారణం తో ప్రభుత్వం చేసిన మరో కార్యక్రమం ఉచితంగా అమలు చేయబడి ప్రజల విశేష స్పందన తో ఉత్తమ ఫలితాలను రాబట్టడం జరిగింది.
4. భాగస్వామ్యం
.
వాటాదారులతో క్రమం తప్పకుండా పరస్పర సమావేశాలు నిర్వహించడం ద్వారా వారిలో నమ్మకం కలిగించడం మరియు భారత దేశ ఆర్దిక పరిస్థితికి భరోసా కల్పించడం , రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులను విశ్వాసంలోకి తీసుకోవడం, తోటి సార్క్ దేశాలు తో చర్చలు జరపడం వ్యాధి నిర్మూలన పరిజ్ఞాన సమాచారం పరస్పర మార్పిడికి జి 20 దేశాలతో సంప్రదింపులు జరపడం , వైద్య పరికరాలు మరియు ఇతర అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంతం చేయడం తో పాటు ఈ విధానాల ద్వారా భారతదేశం స్వయం సమృద్ధి సాధించడ మే కాకుండా ఇతర తోటి దేశాలతో వనరులను మార్పిడి చేసుకునేలా అవకాశం ఏర్పడింది. భారతదేశం యొక్క చురుకైన విధానాలు కేవలం దేశానికి మాత్రమే మేలు చేయకుండా కేసులను కలిగి ఉన్న ఇతర దేశాలకు సైతం సహాయపడింది. వ్యాధి నిర్మూలనకు అత్యవసరమైన ఔషధం హైడ్రాక్సీ క్లోరో క్వీన్(HCQ) ను మరియు వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు PPE కిట్లు ఇతర దేశాలకు సరఫరా చేసి సహాయం చేసింది. రైల్వేలు, సైన్యం, మహిళా సంక్షేమ మంత్రిత్వ శాఖ వంటి విభాగాలు వైద్య సదుపాయాలను పెంపొందించే కార్యక్రమంలో పాల్గొనడంతో భారతదేశం తక్కువ సమయం లోనే వైద్య సేవల రంగం లో ప్రపంచం దేశాలకు సైతం సహాయపడే స్థితిలో చేరుకుంది.
5.సహకారం తో సిద్దపడడం
COVID రహిత సమాజానికి విధించిన లాక్ డౌన్ మరియు పాటించిన సామాజిక దూరం సహాయ పడినదా అనే దానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ 21 రోజుల లాక్ డౌన్ యొక్క క్రియాశీల ప్రకటన వలన ఎదురయ్యే సందర్బాల వలన ఏర్పడే చిక్కులు ప్రభుత్వానికి స్పష్టంగా సహాయ కారి అవుతుంది. ఈ లాక్ డౌన్ కాలంలో COVID స్పెషాలిటీ ఆస్పత్రులు తో పాటు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం వెంటిలేటర్ లు సమకూర్చుకోవడం మరియు PPE కిట్లు తయారు చేయడం వంటి అత్యవసర కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేసింది. తయారీ పరంగా భారత్ అన్నింటికంటే కంటే చాలా ముందుంది. భారతదేశం వంటి పెద్ద దేశ ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని నిరోధించుటకు నియంత్రణ వ్యూహంగా లో ప్రధమ ప్రాధాన్యతగా లాక్ డౌన్ మరియు రెడ్ జోన్ లను మూసివేయడం వంటి చర్యలు చేపట్టింది. ఈ చర్యలకు సహాయపడటానికి భారత దేశ ప్రభుత్వం “ఆరోగ్య సేతు” అనే మొబైల్ యాప్ ని వినియోగం లోకి తీసుకు రావడం జరిగింది. ఈ యాప్ ద్వారా COVID-19 సోకిన రోగులను సమర్థవంతంగా ట్రాక్ చేయడం మరియు పర్యవేక్షించడం ద్వారా వ్యాప్తిని అరికట్టడం దీని లక్ష్యం. అంతే కాకుండా Mygov.in అనే పోర్టల్ ద్వారా సమాచారం, సాధారణ అప్ డేట్ లు, నోటిఫికేషన్‌లు మరియు ఇతర హెచ్చరికలు ప్రజలకు తెలిపేలా ఏర్పాటు చేయడం జరిగింది.
ఆరోగ్య సేతు యాప్ WHO చే వినూత్న పరిష్కారంగా ప్రశంసించబడింది.
(Dr Srikantha Arja, State COVID Nodal Officer)