తెలంగాణలో కరోనాలేదని చెప్పేందుకు పరీక్షలను నిలిపివేశారా, ఆ మధ్య ఈ టాక్ వినిపించింది. అయితే, ఎవరూ దీనిని అంతీ సీరియస్ గా తీసుకోలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తీరు, అధారిటేటివ్ ఆయన చెప్పే విషయాలు విన్నవారికి తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆయన మాటల్ని శంకిస్తేమనలోనే ఏదో లోపముందేమో అనుమానం వచ్చేంత గొప్పగా ఆయన ఏవిషయాన్నయినా చెప్పి నమ్మిస్తారు. ఇదే కరోనా విషయంలో కూడా జరిగిందా?
ఎవరికి అనుమానం వచ్చినా రాకపోయినా, కేంద్రానికి తెలంగాణ కరోనా పరీక్షల మీద అనుమానం వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని (Proactive)గా పరీక్షలు నిర్వహించడంలేని, ఇలాంటి ధోరణి కోవిడ్ -19 మహమ్మారిని అణచేసేందుకు సహకరించదని కేంద్రం వ్యాఖ్యానించింది.
వైరస్ ని మనం వెంటబడి తరమాలి తప్ప, అది మనని వెంబడించకూడాదు (We need to chase the virus rather than the virus chase us) అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ ఎపుడో మే 7వ తేదీనే తెలంగాణ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు.
రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా ఉన్నాయని, అయితే, అక్కడ టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయని కూడా ప్రీతిసూడాన్ లేఖ లో పేర్కొన్నారు.
దేశమంతా జరిగిన పరీక్షలలో తెలంగాణలో జరిగింది కేవలం 1.5 శాతం పరీక్షలే.దేశంలో 14లక్షల RT-PCR (Real Time-Polymerase Chain Reaction) పరీక్షలు జరిగితే తెలంగాణలో జరిగింది కేవలం 20,754 పరీక్షలేనని ఆమె లేఖ లో పేర్కొన్నారు.
ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడుల కంటే బాగా వెనకబడి ఉందని ఆమె లేఖలో రాశారు. ఈ రాష్ట్రాలలో కోవిడ్ -19 కేసులు బాగా ఎక్కువగా కనిపిస్తున్నందుకు కారణం ఇక్కడ పరీక్షలు బాగా జరగడమే. అంటే పరోక్షంగా పరీక్షలు జరపకుండా కేసుల్లేనట్లు తెలంగాణ చెబుతున్నదనేగా అర్థం.
ఈ విషయం మీద ది ప్రింట్ తెలంగాణ చీఫ్ సెక్రటెరీ సోమేష్ కుమార్ ను ఫోన్ లో కాంటాక్ట్ చేసింది. ఆయనేమంటారో తెలుసుకోవాలనుకుంది. ఆయన ఫోన్ కాల్ కు గాని, మెసేజ్ కు గాని స్పందించలేదని ది ప్రింట్ రాసింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం ఆదివారం తక్కువ పరీక్షలు జరుపుతున్న విషయాన్ని ఖండించారు.
ఆయన తన స్పందనను “ The number of tests…is lower means the test are done for the people for whom indication is there strictly as per the ICMR (Indian Council of Medical research) guidelines”. అని ట్వీట్ చేశారు. ఎక్కువ పాజిటివ్ కేసులు కనిపించేందుకు కారణం కాంటాక్ట్ లను కనిపెట్టడంలో తెలంగాణ చక్కగా పనిచేయడమేనని ఆయన వాదించారు.
Once again: Telangana’s testing record and pattern is a national scandal and disgrace. Looks like Article 370 has moved from J&K to Telangana. This is anarchy. Esp in a state including a powerhouse metro like Hyderabad https://t.co/bRO4dRE14T
— Shekhar Gupta (@ShekharGupta) May 17, 2020