అమెరికా తెలుగు వాళ్లందరిని విషాదంలో ముంచి అక్కడి సీనియర్ తెలుగు జర్నలిస్టు కంచిబొట్ల బ్రహ్మ కరోనా వైరస్ సోకి మరణించారు.అమెరికా తెలుగు కమ్యూనిటీలో బాగా పేరున్న జర్నలిస్టు.
ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. కోవిడ్-19 రోగ లక్షణాలుకనిపించడంతో మార్చి 28 న ఆయనను లాంగ్ ఐలండ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సకు జబ్బు లొంగిరాలేదు. ఆయన ఏప్రిల్ 6 న మరణించారు.
చాలా కాలం ఆయన యుఎన్ ఐ కి న్యూయార్క్ నుంచి, ఐక్యరాజ్యసమితి నుంచి విలేకరిగా పని చేశారు.ఈ మధ్య కాలంలో ఆయన భారతీయులకు చెందిన ది ఇండియన్ పానొరామకు,సౌత్ ఏసియన్ టైమ్స్ కు పనిరాస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. బ్రహ్మ కంచిబొట్ట కోవిడ్ -19 తో మృతిచెందడం దురదృష్టకరమని ప్రధాని వ్యాఖ్యానించారు.
Prime Minister @narendramodi expressed grief over passing away of Indian-American journalist Brahm Kanchibotla. https://t.co/RUAioOpfGz
— Prasar Bharati News Services (@PBNS_India) April 8, 2020
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బ్మహ్మ మృతిపట్ల సంతాపం తెలిపారు.
Deeply saddened to learn about the demise of Indian-American journalist, Mr Brahm Kanchibotla in New York. My condolences to the bereaved family members. May his soul rest in peace!
— Vice President of India (@VPSecretariat) April 8, 2020