తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ఇక దేశరాజకీయాల్లోకిరావాలని, యావద్దేశం ఆయన కోసం ఎదరు చూస్తూఉందని తెలంగాణ ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేసే సీఎం కేసీఆర్ మంచి ఆరోగ్యంతో ఇంకా 34 ఏళ్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా,దేశ ప్రధానిగా పనిచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 66వ జన్మదినం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘రాష్ట్రానికి సేవలు అందించడమే కాదు,అవసరం ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గా ఉండి ఆ తరువాత దేశానికి కూడా సేవలు అందించాలి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీరుపై యావత్తు దేశం ఆసక్తిగా మనవైపు చూస్తోంది.తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని భారతదేశం ఆహ్వానించే పరిస్థితులు వస్తున్నాయి,’ ఆయన పేర్కొన్నారు.
తనకు దైవ సమాణులైన సీఎం కేసీఆర్ 66వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షల తెలియచేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు.
అంతకు ముందు వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు.