సాధారణంగా రాజకీయాలకు, ఉద్యమాలకు దూరంగా ఉండే నారాభువనేశ్వరి ఈ రోజు అమరావతి రైతులను కలుసుకుని ఉదమ్యానికి సంఘీభావం ప్రకటించారు.
ఈ రోజు భర్త , మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడితోె కలసి మందడంలో అమరావతి పరిరక్షణ ఉద్యమంలో చేస్తునన రైతులను కలుసుకున్నారు. రాజధానిని అమరావతినుంచి విశాఖ పట్టణానికి తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా వారు గత 17 రోజులు గా దీక్షలు జరుపుతున్నారు.
రాజధానిని అమరావతిలో కొనసాగించాలని, అమరావతి హోదాకేవలం లెజిస్లేటివ్ రాజధాని స్థాయికి కుదించరాదని వారు డిమాండ్ చేస్తున్నారు.
రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించాలనినారా భవనేశ్వరి కోరారు. ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెబుతూ ఆమె తన బంగారు గాజులను రైతుకుఅందించి వాటిని అమ్మితే వచ్చే డబ్బును ఉద్యమానికి ఖర్చుచేయాలని సూచించారు.
పోలవరం , అమరావతి రెండు చంద్రబాబు నాయుడు స్వప్నాలని, ఆయన ఎపుడూ వాటిని పూర్తి చేయడం గురించే కలవరించారని, చివరకు భోజనం చేస్తున్నపుడు కూడా వాటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారని భువనేశ్వరి చెప్పారు.