సెలూన్ లో లైబ్రరీ, పది పేజీలు చదవితే డిస్కౌంట్

హెర్ కట్ సెలూన్ అంటే మీకు ఎంగుర్తుకొస్తుంది. పూర్వం ఒక ముప్పై నలభై యేళ్ల కిందట హెర్ కట్ సెలూన్లలో స్వాతంత్య్ర యోధుల ఫోటోలుండేవి. ఆ తర్వాత ఈ సినిమాపోస్టర్లు వచ్చాయి.  ఇపుడు టివి విధిగా ఉంటుంది.  వచ్చిన  కస్టమర్లను తమ వంతువచ్చే దాకా కూర్చోబెట్టేందుకు వీలుగా అన్ని సెలూన్లలో ఒక దినపత్రిక ఒక సినిమా పత్రిక తప్పక ఉంటుంది. ఇంతకు మంచి హేర్ కట్ సెలూన్ గురించి గొప్పగా చెప్పుకోలేం.
మన రోజూ చూసే సెలూన్ వేరు, తమిళనాడులోని  తూత్తుకుడిలో పొన్ మరియప్ప నడిపే సెలూన్ వేరు. మరియప్ప సెలూన్ ను లైబ్రరీగా మార్చేశాడు. ఆక్కడొక పుస్తకాల  బీరువా, దాని నిండా పుస్తకాలుంటాయి. గోడల మీద సినిమా పోస్టర్లు లేవు. కాకపోతే దేవతల ఫోటోలున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఫోటో ఉంది.
అంటే ఈ సెలూన్ కు వచ్చే ఎవరైనా తమ వంతు వచ్చే దాకా విధిగా కాలక్షేపం  కోసం ఒక పుస్తకం తిరగేయాల్సి ఉంటుంది. అక్కడితో మరియప్ప ఆగడంలేదు.తన సెలూన్ లైబ్రరీ లో ఎవరైనా సరే ఏదయినా పుస్తకం తీసుకుని పది పేజీలు తిరగేస్తూ రు. 30 డిస్కైంట్ కూడా ఇస్తున్నాడు.
పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించేందుకు తానీ పద్ధతి ప్రవేశపెట్టానని మరియఫ్ప చెబుతున్నాడు.మరియప్ప లైబ్రరీ గురించి హెమంత్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.అంతే అది వైరలయింది.మరియప్ప సెలూన్ లైబ్రరీలో  1500 పుస్తకాలు, మ్యాగజైన్లు ఉన్నాయి.

 

దీని మీద స్పందిస్తూ నిజానికి  బార్బర్ షాపు లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చాాలా అనువయిన ప్రదేశమని మరొకవ్యక్తి స్పందించాడు. సరదాగా ఆయనొక సలహా ఇచ్చారు. లైబ్రరీలన్నీ ఫ్రీ హెయిర్ కట్ ఆఫర్ చేయవచ్చుగా అని సలహా ఇచ్చారు.

పదిపేజీలు చదివినందుకు రు. 30 డిస్కౌంట్ ఇస్తున్నాడంటే, ఆయన హేర్ కట్ కు ఎంత చార్జ్ చేస్తున్నాడని మరొకరు విస్తుపోయారు?