హైదరాబాద్:అక్రమాస్తుల కేసు విచారణ ఎదుర్కొంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. ముఖ్యమంత్రిగా కీలకమయిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ప్రతి శుక్రవారం కోర్టు హాజరకావడం వీలుకాదని, ఇది ఖర్చుతో కూడుకున్న పని అని, అందువల్ల వ్యక్తిగా హాజరుకావడం నుంచి మినహా ఇంపు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ వేవారు.
తన తరఫున తన న్యాయవాది అశోక్ రెడ్డి హాజరవుతారని దీనికి అనుమతినీయాలని జగన్ కోరారు.
దీని మీద అన్ని ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు చెబుతూ ఇలా మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది.
జగన్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది.
మినహాయింపు కోరడం మీద సిబిఐ కోర్టు చాలా తీవ్రంగా స్పందించింది.జగన్ మీద మొత్తం 11 చార్జ్ షీట్లను దాఖలు చేసిన విషయం ప్రస్తావిస్తూ, క్విడ్ ప్రో క్వో లో జగన్ ప్రధాన లబ్ది దారుడని, ఆయన ఎంపిగా ఉన్నపుడే , సాక్షులను ప్రభావితం చేస్తాడనే 27.5.2012 నే అరెస్టు చేయడం జరిగిందని సిబిఐ చెప్పింది. జగన్ మీద ఉన్న నేరాలన్నీ కూడా ఆర్థిక నేరాలని అవన్నీ కూడా పెద్ద కుట్రతో కూడుకున్నవని,ఇలాంటి కుట్ర కేసులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని సిబిఐ తాను వేసిన కౌంటర్లో పేర్కొంది. గతంలో జగన్ అరెస్టు చేయడాన్ని ఈ కోర్టుతో సహా హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా సమర్థించాయని సిబిఐ వాదించింది.
జగన్ మీద ఆరోపణలను సుప్రీం కోర్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేంత తీవ్ర నేరాలు (Grave Offences)గా వర్గీకరించిన విషయాన్ని కూడా సిబిఐ కోర్టు దృష్టికి తెచ్చింది.
రాష్ట్రంలో పరిస్థితులు మారి వుండవచ్చు, అయితే నేరంలో ఎలాంటి మార్పురాలేని అందువల్ల ఉన్నత స్థానంలో ఉన్న జగన్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వవవద్దని సీబీఐ వాదించింది.
జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయడానికి యత్నించారు, జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు.మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదించింది.
వ్యక్తి గత హాజరునుంచి మినహాయింపు కోరేందుకు జగన్ చూపిన కారణాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉండటం, రెవిన్యూలోటు వంటివి సరైన కారణాలు కావని కూడా సిబిఐ వాదించింది.
“…. If the request of the petitioner (Jagan) seeking dispensation of his personal attendance in the court on whatever grounds pleaded in the petition (is considered), will virtually entail him to liberate himself from the lawful restrictions imposed by this Hon’ble Court to ensure the ends of justice and give him an unsolicited liberty to do whatever he wants and influence the witnesses behind the iron wall of political, money and muscle powers”. It also pointed out, “In all the 11 charge sheets, the petitioner (Jagan) stands as an accused in his individual capacity and as representative of his privately owned companies and therefore should attend the court as such. Any reference to the revenue and financial condition of government of Andhra Pradesh is only an attempt to deviate the attention of the court from real issues” అని సిబిఐ వాదించింది.
గతంలో హైకోర్టు జగన్ వేసిన మినహాయింపు పిటిషన్ తిరస్కరించిన విషయాన్ని కూడా సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. జైల్లో ఉన్న సమయంలోనే జగన్ సాక్ష్యాలను తారుమారు చేసారని కోర్టుకు తెలిపింది.
సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఏకీభవించి, ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.