తెలంగాణ బంద్ కు జనసేన పవన్ మద్దతు

* తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జెఏసి ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈమేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలోని అంశాలు…

* ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలి.

* ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్ లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరం. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదు.

* 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుంది. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అనే ఆందోళన అందరిలో కలిగింది.

* ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చించాలి. సమ్మె జఠిలం కాకుండా పరిష్కరించాలి.

*బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలి.

*నిన్న ఖమ్మం జిల్లాలో శ్రీనివాస రెడ్డి అనే కార్మికుడు కుటుంబ సభ్యల ముందే ఆత్మాహుతికి పాల్పడటం, ఇపుడు రాణిగంజ్ డిపో ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం సమ్మె తీవ్రతను తెలియచేస్తున్నాయి.

 

*ఆర్టీసి సమ్మెలో కొన్ని నెరవేర్చగలిగినవి, కొన్ని నెరవేర్చలేనివి ఉంటాయి. అలాంటపుడు ప్రభుత్వం చర్చల ద్వారానే నచ్చ చెప్పాలి. అలా కాకుండా ఉద్యోగులందరిని తొలగిస్తున్నామని చెప్పడం వారిని బాగా అభద్రతా భావానికి గురి చేసింది. సమస్య ను జటిలం చేయకుండా కార్మికుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి.