ఇండోపాక్ అణుయుద్ధం వస్తే… హెచ్చరిక

ఇండియా పాకిస్తాన్ ల మధ్య అణు యుద్ధం వస్తే ఏమవుతుంది? ఈ రెండుదేశాలను సర్వనాశనంచేయడమే కాదు, అది ప్రపంచానికి కూడా తీవ్ర హాని చేస్తుందని శాస్త్రవేత్తులు హెచ్చరిస్తున్నారు.
ఈ రెండు పొరుగుదేశాల మధ్య అణుయుద్దం వస్తే, కొద్ది రోజుల్లోనే 12.5 కోట్ల మంది చనిపోతారని పది మంది శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అంతేకాదు, ఇండోపాక్ అణుయుద్ధం ప్రపంచ పర్యావరణంలో తీవ్రపరిణామాలు తీసుకువస్తుందని వారు హెచ్చరించారు.
శాస్త్రవేత్తలు ఒవెన్ బి టూన్, చార్లెస్ జి బార్డీన్, ఎలాన్ రొబాక్, హాన్స్ క్రీస్టెన్ సేన్, మాథ్యూ మెకెంజీ, ఆర్ జె పీటర్ సన్, చెరైల్ ఎస్ హ్యారిసన్, నికాల్ ఎస్ లోవెన్ డుస్కీ రిచార్డర్ పి టర్కోలు ఇండోపాక్ అణుయుద్ధం వస్తే ఎలాంటి పరిణమాలు ఎదురవుతాయనే దాని మీద అధ్యయనం చేశారు.
వారి రీసెర్చ్ పేపర్ బుధవారం నాడు సైన్స్ అడ్వాన్సెస్ (Scinence Advances) మ్యాగజైన్లో అచ్చయింది. వీల్లంతా అమెరికాలోని పేరుమోసిన వాతావారణ భౌతిక శాస్త్ర పరిశోధనా కేంద్రాలలో పనిచేస్తున్న పేరున్న శాస్త్రవేత్తలు.
ఈ అణుయుద్ధం రెండు దేశాలలోని కోట్లాది మందిని మాడ్చేయడమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ఉష్ణోగ్రతలను బాగా తగ్గించే గ్లోబల్ మెల్ట్ డౌన్ కదారి తీస్తుందిన వారు ఈపేపర్లో హెచ్చరించారు. ప్రపంచ వ్యాపింతంగా అపుడు ఉష్టోగ్రత మంచుయుగాలను తలపిస్తుందని వారు చెప్పారు.
“Such war would threaten not only the locations where bombs might be targeted but the entire world,” ఈ రీసెర్చ్ పేపర్ రాసిన ఎలాన్ బ్రూక్ ( రట్జెర్స్ యూనివర్శిటీ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ ప్రొఫెసర్) చెప్పారు.
ఇండియా పాకిస్తాన్ లు  వేసుకునే ప్రతి ఆటంబాంబు దాదాపు 7 లక్షల మంది హతమారుస్తుందని వీరు చేపట్టిన స్టడీ కంప్యూటర్ సిమ్యులేషన్స్ వెల్లడించాయి.
అంతేకాదు, ఈ అణుబాంబు విస్పోటనాల వల్ల బూడిద మసి, ఇతర చెత్తచెదారం విపరీతంగా లేచి ఆకాశాన్నంతా ఆవరించి ‘న్యూక్లియర్ వింటర్’ ను సృష్టిస్తుందని వారు హెచ్చరించారు. దీని వల్ల ప్రపంచమంతా ఆకలి మంటలు లేస్తాయని కూడా వారు చెప్పారు.
ఇలాంటి ఉపద్రవం మానవజాతికి కనివిని ఎరుగనిదని ఈ రీసెర్చ్ లో పాల్గొన్న మరొక ఫ్రొఫెసర్ బ్రియన్ టూన్ పేర్కొన్నారు.నూక్లియార్ వింటర్ వస్తే ప్రపంచమంతా పంటలు విఫలమయి కరువు కాటకాలు వస్తాయి.ఆకలి చావులు మొదలయితాయి.
ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ లదగ్గిర దాదాపు 300 దాకా ఆటంబాంబులున్నాయి.2025 నాటికి వీటి సంఖ్య 500 కు చేరుకుంటుంది. వాళ్ల కంప్యూటర్ సిమ్యులేషన్స్ ప్రకారం 2025లొ అణయుద్ధం జరిగేఅవకాశం సూచించింది. పాకిస్తాన్ ఇండియాలు ఈ విషయాన్ని గుర్తున్చుకోవాలని టూన్ కోరారు.
ఈ శాస్త్రవేత్తలు సిమ్యులేషన్స్ ప్రకారం పరిస్థతి ఇలా ఉంటుంది.
‘‘భారతదేశం మీద టెర్రరిస్టు దాడితో యుద్ద వాతావరణం అలుముకుంటుంది.
ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశం, సైన్యాన్ని  ట్యాంకులను పెద్ద ఎత్తున  సరిహద్దుల్లోకి తరలించి అక్కడి నుంచి సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి చొరబడుతుంది. కాశ్మీర్ లో కూడా లైన్ ఆఫ్ కంట్రోలు దాటి భారత్ సైన్యాలు ముందుకు దూసుకుపోతాయి.
ఇదే అణుయుద్ధానికి దారితీస్తుంది. మొదటి రోజున పాకిస్తాన్ 5 కిలోటన్ ఈల్డ్ ఉన్న 10 టాక్టికల్ ఎటామిక్ బాంబులను భారత్ ట్యాంకుల మీదకు ప్రయోగిస్తుంది.
రెండో రోజున పాకిస్తాన్ అంతే పరిమాణం ఉన్నమరొక 15 టాక్టికల్ అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది.
అపుడు ఇండియా బహవల్ పూర్ లోని పాకిస్తాన్ గ్యారిసన్ మీదకు రెండు  బాంబులను ప్రయోగిస్తుంది.
తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్స్ మీదకు, న్యూక్లియార్ డిపోలకు మీదకు బారత్ మరొక 18 బాంబులను ఇతర ఆయుధాలను ప్రయోగిస్తుంది.
దీనితో పాకిస్తాన్ అణుపాటవం కొంత దెబ్బ తింటుంది.ఎదురు దాడి చేసే శక్తి తగ్గిపోతుంది.
అయినప్పటికీ మూడో రోజున పాకిస్తాన్ న్యూక్లియర్ బాల్లిస్టిక్, క్రూజ్ మిసైల్స్ ను భారత్ మిలిటరీ స్థావరాలకు మీదకు,న్యూక్లియార్ డిపోల మీదకు 30పట్టణాలలో ఉన్న ఎయిర్ ఫీల్డ్స్ మీదకు ప్రయోగిస్తుంది.
వీటితోపాటు 5 కిలో టన్ ల శక్తి వున్న మరొక 15 టాక్టికల్ బాంబులను ప్రయోగిస్తుంది. మూడో రోజున భారతదేశంలో కూడా 10 స్ట్రటజిక్ బాంబులను పాక్ మిలిటరీ స్థావరాల మీదకు ప్రయోగిస్తుంది. నాలుగో రోజు నుంచి ఏడో రోజు మధ్య యుద్ధం భీకరమవుతుంది.
భారతదేశం మీదకు పాకిస్తాన్ 120 బాంబులను ప్రయోగిస్తే, భారత్ 15 నుంచి 100కిలో టన్నుల 70బాంబులను ప్రయోగిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ పట్టణ ప్రాంతాలలో 100 బాంబు దాడులు జరిగితే, ఇండియామీద 150 బాంబుల దాకా పడతాయి….’’ ఇలా సాగుతుందని ఈ రీసెర్చ్ పేపర్ పేర్కొంది..
ఆటంబాంబులు మోసుకెళ్లే అగ్ని5(ఇండియా), షహీన్ 2 (పాక్) మిసైల్స్ ఇవే