హైదరాబాద్ ఐఐటి విద్యార్థి ఆత్మహత్యకు కేంద్రం కదిలింది.
ఐఐటి వంటి అన్ని కేంద్ర పాలిత ఉన్నత విద్యాకేంద్రాలలో ఆత్మ హత్యలను నివారించేందుకు వెల్ నెస్ సెంటర్స్ ను ప్రారంభించాలని, ఇది తప్పని సరి అని కేంద్రం నిర్ణయించింది.
ఈ విషయం గత వారంలోజరిగిన ఐఐటి కౌన్సిల్ చర్చకు వచ్చింది.
అక్కడ కేంద్ర మానవ వనరుల శాఖ చాలా స్సష్టమయిన అదేశాలు జారీ చేస్తూ దేశంలోని 23 ఐఐటిలలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు వెల్ నెస్ సెంటర్లను తప్పనిసరిగా (Mandatory)ఏర్పాటుచేయాలని ఆదేశించింది.
ఇపుడిలాంటి సెంటర్లు కేవలం ఢిల్లీ, మద్రాస్, ముంబైలలోమాత్రమే ఉన్నాయి.
విద్యార్థుల మీద పెరుగుతున్న మానసిక వత్తిడిని తట్టుకునేందుకు ఈ వెల్ నెస్ సెంటర్లలో తగిన సలహాలు ఇచ్చేందుకు ప్రొఫెషనల్స్ నియమించాలని కేంద్రం ఐఐటిలను ఆదేశించిందని ఐఐటి కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న అధికారి ఒకరు ‘ది ప్రింట్’ కు చెప్పారు.
సుమారు 300 మంది ప్రొఫెషనల్స్ ను కౌన్సెలర్లను ఆన్ లైన్ ప్రాతిపదికన నియమించాలని, విద్యార్థులకు తగిన గైడెన్స్ ఇచ్చేందుకు ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములను చేయాలని కేంద్రం భావిస్తున్నది.
నవంబర్ నుంచి ఈ విధానం అమలులోకి వచ్చే వీలుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ ఐఐటికి చెందిన మార్క్ యాండ్రూ చార్లెస్ (20) అనే విద్యార్థి ఒక సూయిసైట్ నోట్ రాసి పెట్టి ఈజూలై 2 న తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చార్లెస్ ఉత్తర ప్రదేశ్ వారణాసి జిల్లా నారియా లంకా కు చెందినవిద్యార్థి.
ఇది ఈ ఐఐటిలో ఈ ఏడాడి రెండో ఆత్మహత్య. మొదటిది ఫిబ్రవరిలో జరిగింది. అపుడు అనిరుధ్య ముమ్మనేని అనే మూడో సంవత్సరపు విద్యార్థి హాస్టర్ ఏడో అంతస్తు నుంచి దూకి చనిపోయారు.
చార్లెస్ డిజైనింగ్ మాస్టర్స్ చేస్తున్నాడు. ఫైనల్ పరీక్ష కూడారాశాడు. పైనల్ ప్రెజెంటేషన్ మాత్రమే పెండింగులో ఉంది. ఈ దశలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు మంచి మార్కులు వచ్చే అవకాశం లేదని, తనలాగా విఫలమయిన వాళ్లకు భవిష్యత్తు లేదని ఆయన 5 పేజీల సుయ్ సైడ్ నోట్ లో రాశారు.
అధిక వత్తడితో క్రంగిపోయి ఆయన ఆత్మహత్యకు పాల్పడి నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. తన గురించి ఆయన చాలా తక్కువగా అంచనా వేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
” I never Thought I would end up letting all of you down. I don’t deserve it I am not worthy. Just know that I love you all back just the way you did because that is what friends to right? And also I am not doing this because I am sad now..,”
ఈ దారుణం తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ అన్ని ఐఐటిల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసి ఒక కమిటీని నియమించింది. ఐఐటి క్యాంపస్ లలో ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు సూచించాలని కోరింది. విద్యార్థులు రకరకాల నేపథ్యంనుంచి వస్తున్నారని, కొందరేమో అక్కడి అకడమిక్ వత్తిడి తట్టుకోలేకపోతుంటే మరికొందరు హిందీ మీడియం నుంచి రావడంతో మీడియం మారడంతో డిప్రెషన్ కు గురవుతున్నారని కమిటీ అభిప్రాయపడింది.
అప్పటికే కోచింగ్ అనో, జెయియి పరీక్ష ఎలాగైనా పాస్ కావాలనో తీవ్రమయిన వత్తిడికి లోయిన విద్యార్థులు ఐఐటిలలో ప్రవేశిస్తారు.అక్కడ మళ్లీ వత్తిడి పెరుగుతుంది.దీనిని చాలా మంది ఎదిరించి నిలబడ లేకపోతున్నారని ఒక ప్రొఫెసర్ చెప్పారు.
వత్తిడికి లోనై క్రుంగి పోతున్న విద్యార్థులను గుర్తించేందుకు ఫ్యాకల్టీ సాయం తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇప్పించి మానసిక స్థయిర్యం వచ్చేలా చూడాలని మానవ వనరుల శాఖ ఐఐటిలను కోరింది.