కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం గురించి ఆలోచిస్తూఉంది. 2022 , ఆగస్టు 15 న భారత ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నది.
ఈ లోపు ఇపుడున్న చారిత్రాత్మక పార్లమెంటు భవనానికి కొత్త హంగులు ఇవ్వడమో , అసలు కొత్త భవన నిర్మాణం చేపట్టడమో చేయాలని కేంద్రం ఆలోచిస్తూ ఉంది.
దీనికి సంబంధించి డిజైన్లు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రిక్వెస్ట్ ఫర్ ఫ్రపోజల్ (RFP)ని ఈ నెల రెండోతేదీనే జారీ చేసిందని మీడియా కథనం.
ఇపుడున్న పార్లమెంటు భవనాన్ని ఇంకా అందంగా కనిపించే విధంగా డెవలప్ చేయడానికి, రాష్ట్ర పతి భవన్ నుంచి ఇండియా గేట్ దాకా ఉండే మూడు కిలో మీటర్ల రోడ్డును అందంగా తీర్చిదిద్దడం, దానితోపాటు అన్ని మంత్రిత్వ శాఖలకు ఒక కామన్ సెక్రెటేరియట్ నిర్మాణానికి సబంధించి డిజైన్ లు పంపించాలని కేంద్రం అనేక డిజైన్ కంపెనీలను కోరింది.
ఇటీవల జరిగిన పార్లమెంట సమావేశాలో లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా,రాజ్యసభ ఛెయిర్మన్ వెంకయ్య నాయుడు లు పార్లమెంటును ఆధునీకీకరించే ప్రతిపాదనను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం రంగంలోకి దిగింది.