నవయుగ కంపెనీకి కు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది. ఇదే విధంగా ఈ ప్రాజక్టుకు సంబంధించిరూ. 3216.11 కోట్ల టెండర్ రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇలాగే రివర్స్ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లను ఆహ్వానించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.
క్యాబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదం
ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్ ఆమోదం
రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం
ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి ఆమోదం
మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం
పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించిన మంత్రివర్గం. భూముల లీజు ఫీజు కూడా చెల్లించలేదని కేబినెట్‌కు తెలిపిన పరిశ్రమల శాఖ.
టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రివర్గం
భోగరాజు పట్టాభిసీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్ డిమాండ్. ప్రధానికి సీఎం లేఖరాయాలని నిర్ణయించిన కేబినెట్