దేశమంతా దేశ భక్తితో ఈ రోజు 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అంతకుముందు రాజ్‌ఘాట్ చేరుకున్న ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి త్రివిధ దళాలు గౌరవవందనం సమర్పించాయి.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రం అని అన్నారు.
స్వాతంత్య్రం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు.
ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారని, వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే…
ప్రధాని ప్రసంగంలో మిళ మిళ లాడే తెలుపు
* ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేశాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలను నెరవేర్చాం.
* దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్తాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలువద్దు.
* సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు చేశాం.
* స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అంటే గత 70 సంవ్సరాలుగా ఎన్నో పథకాలు అమలుచేశారు.కానీ ఇప్పటికి 70 శాతం మందికి మంచినీళ్లు లేవు. అందుకే వాళ్ల తాగు నీరు ఇచ్చేందుకు జల్ జీవన్ మిషన్ ప్రారంభించాం.
* దేశంలో ప్రతిజిల్లాకు ఒక విశేషం ఉంది. లోకల్ ప్రాడక్ట్స్ ఆకర్షనీయం చేసి ప్రమోట్ చేద్దాం. మా మార్గదర్శక సూత్రం zero defect- zero effect
* గత 70 సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేసిన అవినీతి,నల్లదనం నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నాం.
* ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలకు వరం వంటిది. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి తేవాలన్నదే మా లక్ష్యం. వచ్చే ఐదేళ్లు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం.
* రెండో సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
* తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు సాధికారత కల్పించాం.రాజ్యాంగ స్ఫూర్తితో ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం,
* 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం.
ప్రధాని ప్రసంగంలో నలుపు
అయితే, దేశ అర్థిక పరిస్థితి అంత ప్రధాని ఉపన్యాసమంతా పచ్చగాలేదని Times Now అందించిన వివరాలు చూస్తే అర్థమవుతుంది.
ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలో పడింది. 2018 జిడిపి(Gross Domestic Product) ర్యాంకింగ్ పడిపోయింది.
గతంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో ఆరోస్థానంలో ఉన్న ఇండియాను ప్రపంచ బ్యాంకు ఏడో స్థానానికి దించేసింది. ఆరోస్థానంలోకి ఫ్రాన్స్ వచ్చి చేరింది. ఇండియా జిడిపి కేవలం 2.71 ట్రిలియన్ డాలర్లే. ఫ్రాన్స్ జిడిపి 2.77 ట్రిలియన్ డాలర్లయితే, ఇంగ్లండు 2.82 ట్రిలియన్ డాలర్లు. అంతకు ముందు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్థిక వ్యవస్థ ముద్ర ను ఇండియా పొగొట్టుకుంది. ఇపుడ ఇండియా చైనా కంటే వెనకబడి ఉంది.
గత ఇదేళ్లలో భారతదేశ ఆర్థిక ప్రగతి నత్తనడకలో ఉంది. 2018-19 మొదటి క్వార్టర్ (జనవరి-మార్చి) అభివృద్ధి రేటు కేవలం 5.8శాతమే. 2018-19లో మొత్తంగా తీసుకుంటే అభివృద్ధి రేటు గత ఏడాది రేటు 7.2 శాతం నుంచి 6.8 శాతానికి పడిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు పెరగాలని మోదీ 2.0 లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు జరిగిందిదంతా. భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిగెత్తిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుుకు చేయాల్సిందంతా చేస్తామని,2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారుస్తాని ప్రధాని పేర్కొంటున్నారు.
To some, the target of nearly doubling the size of the Indian economy to $5 trillion in five years may seem difficult. But when we have in five years (of BJP rule) added $1 trillion as compared to $2 trillion-size achieved in 70 years of Independence, this target is achievable: The PM
ఉద్యోగాలు తగ్గిపోతున్నాయ్
ప్రధాని ప్రసంగం అంతా బీజేపీ పాలనలో సాధించామని చెబుతున్న అభివృద్ధి గురించే సాగిందని, సాధించ లేకపోయిన అనేక ముఖ్యమయిన వాటి గురించి ప్రస్తావన లేదు.
మోదీ ఎర్రకోట ప్రసంగం కాస్త సుదీర్ఘంగా బాగానే ఉంది. 70 ఏళ్లలో చేయని వాటిని తమ ప్రభుత్వం 70 రోజులలో చేసినట్లు చెబుతున్నారు. అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారు. కానీ, ఉపాధి కల్పనతోనే అసలైన అభివృద్ధి సాధ్యం. ప్రస్తుతం ఉద్యోగాలు పెరగడం లేదు.
ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని వారం రోజులుగా మీడియా రాస్తూ ఉంది.అటోమొబైల్ సెక్టర్ గత 20 సం.లలో లేనంత సంక్షోభంలో పడిందని, ఇటీవలదాదాపు 2.30 లక్షలు ఉద్యోగాలు ఈ రంగం నుంచి ఎగిరిపోయాయని సొసైటి అప్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) డేటా ను ఉదహరిస్తూ ఇండియా టుడే రాసింది.
ఇదే విధంగా కన్స్ స్ట్రక్షన్ సెక్టర్ లో కూడా ఉద్యోగాలు మాయమయ్యాయి. ఇది పేదరైతుల మీద తీవ్ర ప్రభావం చూపుతూ ఉందని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
భారతదేశంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా చెబుతూ ఉంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం 1.1 కోట్ల మంది 2018లో ఉపాది కోల్పోయారని బిజినెస్ టుడే రాసింది.
ఉద్యోగాలు లేకుండా ప్రగతి సాధ్యం కాదు. భారత్ వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావాలంటే ఉపాధి అందునా నికరమయిన ఉపాధి పెరగాలి.
దీనికోసం ఇంతవరకు పెద్ద ప్రయత్నం జరగలేదు. ప్రధాని ప్రసంగంలో సాధించామని చెబుతున్న జాబితా అర్థవంతమయ్యేది ఉపాధి కల్పన తోనే. మోడీ 2.0 ప్రభుత్వం తక్షణం దృష్టి నిలపాల్సింది ఉపాధి మీద. ఉద్యోగ ఉపాధి అవసరాలుపెరిగేందుకు ప్రభుత్వవిధానాలు ఎలా రూపాంతరం చెందుతాయో చూద్దాం.