ఈ రోజు భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 142 వ జయంతి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఘనంగా పలు కార్యక్రమాలు నిర్వహించస్తున్నారు. అయితే, ఆయన సేవలకు, త్యాాగానికి గుర్తింపు భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారం ఇవ్వాలని పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు కోరుతున్నది.
పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నల్లకుంట ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఒరిస్సా , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నందు అనేక సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జాతి గర్వించదగ్గ వ్యక్తి అయిన పింగళి వెంకయ్య గారికి భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గౌరవించడం సముచితమని మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి కే హెచ్ ఎస్ జగదాంబ కోరారు.
1921 జాతిపిత మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు మార్చి 31′ ఏప్రిల్ 1 న విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య జండా ను రూపొందించారు. అపుడు రెండు రోజులు ( మార్చి 31 మరియు ఏప్రిల్ 1) జాతీయ పర్వదినాలుగా ప్రకటించాలని నిర్ణయించారు.
భవిష్యత్తులో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి వారసురాలు శ్రీమతి పింగళ సుశీల మరియు ట్రస్ట్ సభ్యులందరితో కలసి మొదటి విడతగా విద్య, వైద్యం, మరియు స్వయం ఉపాధిపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. వివరాలకుకింది అడ్రసును సంప్రదించవచ్చు.