త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో రెండు దశాబ్దాలుగా పదవిలో ఉన్న మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని దించేసి భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీని విధ్వంస పరిణామాలు అపుడే కనబడటం మొదలయింది. రాజధాని అగర్తల బెలోనియా కాలేజ్ స్క్వే ర్ లో ఉన్న వ్లదిమీర్ లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్ల సహాయంతో పెకలించి పడేశారు దుండగులు. ఈ సంఘటన సోమవారం నాడు పట్టపగలు జరిగింది. సిపిఎం ఓడిపోయాక మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే విధ్వంసం మొదయలింది. రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఏరివేత లో భాగంగా హింస చెలరేగుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వీడియో….