వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేఫా మస్రత్ ఖానం ఇపుడు హెడ్ లైన్స్ లో ఉన్నారు.
ఆమె తన కూతురు తబిష్ రైనా ను ఖమ్మంలోని సర్కారు గురుకుల పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వం అంటే అంతా నాసిరకం, అవినీతి అనే చులకన భావం ప్రజల్లో ఉంది. ప్రభుత్వంలోకి వచ్చే వాళ్లంతా హాయిగా తినేందుకే తప్ప, ప్రజలకేమయిన చేసేందుకు కాదనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది.ఇదేమీ పట్టనట్లు, మార్చేందుకు మనచేతేమవుతుందని చాలా మంది ఉన్నతోద్యోగాలు చేసుకుని హాయిగా రిటైరయిపోతుంటారు.
ప్రభుత్వం మీద ప్రజల్లో ఈ చులకన భావం ఏర్పడేందుకు ప్రభుత్వ పనిచేస్తున్నతీరేకారణం.
ప్రభుత్వంలో కూడా మంచి ఉంది, మంచి మనుషులున్నారు, మంచిపనులు జరుగుతున్నాయి, అందువల్ల నిరాశ వద్దు, ప్రభుత్వాన్నినమ్మండి, బలపర్చండి అని చెప్పే అధికారులు బాగా తక్కువ. వాళ్లు ప్రభుత్వానికి అంటుకున్న అపకీర్తి మరకలు కడిగేసేందుకు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ల కోవలోకే వస్తారు వికారాబాద్ కలెక్టర్ ఆయేషా.
ఆయేషా తన కూతురిని వికారాబాద్ లోని ప్రభుత్వ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల-1 లో చేర్పించారు. సబీస్ ఇంతకు నాలుగో తరగతి దాకా ఖమ్మం జిల్లాలోని ఒక ప్రయివేట్ స్కూళ్లో చదువుకున్నారు. మార్చిఒకటి ఆయేషా వికారాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అమ్మాయిని అయిదో తరగతిలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పించి, ఈ పాఠశాలంటే భయపడాల్సిన పనిలేదు, అక్కడ కూడా మేలైన విద్య దొరుకుతుందని మైనారిటీ ప్రజల్లో ముఖ్యంగా పేదలలో ఆత్మవిశ్వాసం కల్గించేందుకు పూనుకున్నారు. కలెక్కర్ కూతురు క్లాసులో ఉంటే స్కూల్ మీద దాని ప్రభావం చాలా పాజిటివ్ గా ఉంటుందనేది వేరే విషయం.
నిజానికి ఇపుడున్న వాతావరణంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే, ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచేందుకు బాగా ప్రయత్నాలు జరుగుతున్నా అవి సత్ఫలితాలు రావడానికి చాలా టైం పడుతుంది, అలాంటపు చొరవతీసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఎవరూ ముందుకురారు.
ప్రభుత్వ పాఠశాలల మీద ఆయేషా అభిప్రాయం వేరు. ‘పిల్లలు నిజమైన వజ్రాలు. సరైన పద్దతిలో సానబడితే, వాళ్లలో ఉన్న ప్రతిభా, నైపుణ్యాలు బయటకు వస్తాయి. ఈ పని ఏ విద్యా సంస్థ అయినా చేయగలదు. మనకు అద్భతమయిన రెసిడెన్షియల్, డే స్కాలర్ స్కూళ్లున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల చాలా రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు,’ అని అమె అన్నారు.
“The real gems are children and their talent and potential can be brought out by any institution through proper nurturing. We have excellent government residential and day schools now and these students are making their mark in every field on par with those from private institutions,or even better.” అని ఆమె ప్రభుత్వ పాఠశాలల మీద తనకున్న విశ్వాసాన్ని వ్యక్తీకరించారు.
వికారాబాద్ కలెక్టర్ గా మార్చిలో వచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలలొ చదువు బాగుండదనేని గుడ్డి నమ్మకం మాత్రమేనని ఆమె అంటున్నారు. వికారాబాద్ జిల్లలో టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ ఈ ఏడాది 18 శాతం పెరిగిందని ఆమె చెబుతున్నారు. కలెక్టర్ కూతురును సర్కార్ బడిలో చేరిస్తే మంచి పేరొస్తుందనో, తనొక ఆదర్శకలెక్టర్ అవుతారనో ఆయేషా తనకూతురిని మైనారి టీ గురుకుల పాఠశాలలో చేర్పించలేదు.
ప్రభుత్వం పాఠశాలలు బాగా పనిచేస్తున్నాయి, విద్యాబోధన బాగా ఉందని నమ్మిమాత్రమే తాను పాపని పాఠశాలలో చేర్పించానని ఆమె చెబుతున్నారు.
” I made my choice based on my faith in Government institutions,” అని ఆమె ది హిందూ పత్రికకు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలనేదాని మీద ఆమె క్యాంపెయిన్ చేపట్టారు. ఈ కన్విక్షన్ నుంచే ఆమె తన కూతురిని మైనారిటీ గురుకుల పాఠశాలలో చేర్పించారు.
ఆమె క్యాంపెయిన్ లో నిజాయితీ ఉంది. అందుకే ఉద్యోగ ధర్మంగా చేయడం లేదు, తాను నమ్మింది, చూసింది, తన పొజిషన్ ద్వారా నలుగురికి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల మీద ఇంత గురి కుదరడానికి కారణం ఆమెకు చదువు నేర్పించి, ఈ స్థాయికి తీసుకువచ్చింది ప్రభుత్వ పాఠశాలు లేనని ఆమెకు తెలుసు. అదే ఆమెను ఇపుడు నడిపిస్తున్నదని ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే అర్థమవుతుంది. అందుకే ఆమెను హృదయపూర్వకంగా అభినందించకుండా ఉండలేం.
కలెక్టర్ ఆయేషా గురించి…
ఆయేషా స్వయంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చింది. ఆమె 12 వతరగతి దాకా కొమరం భీమ్-ఆసిఫా బాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఆమెకుమారుడు కూడా ఇపడు కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు.
నిజానికి ఒకపుడు జర్నలిస్టు. ఇక ఇంగ్లీష్ పత్రికలకు హైదరాబాద్ క్రైం రిపోర్టర్ గా జీవితం ప్రారంభించారు. సాధారణంగా మహిళలు క్రైం రిపోర్ట ర్ అసైన్ మెంట్ లోకిరారు. దీనికి మొండి ధైర్యం అవసరం. అంతేకాదు, సిస్టమ్ ఇంకా పూర్తిగా పాడవలేదు,మంచితనం ఉందని నమ్మకం కూడా కావాలి. ఎందుకంటే, వ్యవహారం నేరాలు ఘోరాలతోనే .ఆమె జర్నలిజంలో బిసిజె చేసి క్రైమ్ రిపోర్టయ్యారు. తర్వాత నాగపూర్ యూనివర్శిటీ లో ఎంబిఎ గోల్డ్ మెడల్ తో పాసయ్యారు. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాయి ఎంపిడివొ అయ్యారు. ఆపైన ప్రమోషన్ మీద అంచెంచెలగా ఎదిగి ఐఎఎస్ ప్రమోషన్ పొందారు. 2009లో ఆమెకు ఐఎఎస్ ప్రమోషన్ వచ్చింది.
(ఈ స్టోరీ, ఇందులోని సందేశం మీకు నచ్చిందా, నలుగురికి షేర్ చేయండి. trendingtelugunews.com నుప్రోత్సహించండి)